Ads
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. చిరంజీవి అందరికీ సుపరిచితమే. టాలీవుడ్ లో టాప్ హీరోల్లో చిరంజీవి కూడా ఒకరు. ఈయనని ఆదర్శంగా తీసుకుని చాలా మంది ఇండస్ట్రీలోకి వస్తున్నారు.
Video Advertisement
ఎంతగానో కష్టపడి ఇంత మంచి పొజిషన్ లోకి వచ్చారు అంటే మామూలు విషయం కాదు. ఏది ఏమైనా చిరంజీవి తన డాన్స్ తో, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
చాలా మంది హీరోయిన్లతో చిరంజీవి నటించారు. వారిలో చాలా మంది సీనియర్ నటులు కూడా వున్నారు. అయితే కేవలం సీనియర్ నటులతో మాత్రమే కాకుండా ఇప్పటి టాప్ హీరోయిన్లతో కూడా చిరంజీవి నటించడం విశేషం. అయితే ఒకసారి మాత్రం ఇద్దరు హీరోయిన్లు మెగాస్టార్ చిరంజీవి గురించి ఏకంగా గొడవే పెట్టేసుకున్నారు. ఇంతకీ అసలు ఏమైంది అనేది చూస్తే…
చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా మర్చిపోలేము. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అయితే ఇంద్ర సమయంలో చిరు కోసం హీరోయిన్ ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే కొట్టుకోవడం జరిగింది. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే చిరంజీవి పక్కన జంటగా నటించారు. ఈ సినిమా ముగింపులో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే ఇంద్ర కోసం కొట్లాడుతున్నారు.
నిజానికి ఇది మనకి చూడడానికి ఎంతో సరదాగా ఉంటుంది. కానీ ఈ దర్శకుడు మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ సినిమాకి బి.గోపాల్ దర్శకత్వం వహించారు. అయితే ఆయనికి ఎవరిని భార్యగా చూపించాలి అనేది అర్థం కాలేదు. ఆఖరికి నాతో చిరంజీవి ఉండేలా ఆర్తి అగర్వాల్ కథ రాయమంటే.. నాతో వచ్చేటట్టు రాయమని సోనాలి బింద్రే కూడా చెప్పారు. ఇలా సరదాగా చిరంజీవి కోసం ఇద్దరు నటులు కూడా గొడవ పడ్డారు. ఇక ఈ సినిమా వంద రోజులకు పైగా ఆడిన విషయం తెలిసిందే.
End of Article