Ads
సాధారణంగా కార్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు తమ వాహనం పట్ల ఎంతో జాగరూకతతో వ్యవహరిస్తుంటారు. ఏదైనా రోడ్డుపై పార్క్ చేయాల్సి వచ్చినప్పుడు కచ్చితంగా లాక్ చేస్తారు. అలాగే.. లాక్ చేసామో లేదో అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ ఉంటారు. కానీ, ఆ నగరంలో మాత్రం అసలు కార్లను లాక్ చేయరట.
Video Advertisement
ఇదేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? మరి కార్లను ఎవరైనా దొంగిలిస్తేనో.. అని అనుమానపడుతున్నారా..? ఆగండాగండి.. అసలు ఈ కార్లను ఒకళ్ళు.. ఇద్దరూ కాదు అసలెవ్వరూ లాక్ చేయరు. దీని వెనుక కారణం ఏంటో తెలుసుకోండి.
కెనడాకు చెందిన ఈ నగరంలో కార్లు రోజులో ఇరవై నాలుగు గంటలూ అన్ లాక్ లోనే ఉంటాయి. ధృవపు ఎలుగు బంట్ల నుంచి రక్షణ పొందడం కోసం ఇలా చేస్తుంటారట. కెనడాలోని మనిటోబాలో ఉన్న చర్చిల్ ప్రాంతంలో ఇలా చేస్తుంటారు. ఈ ప్రాంతంలో ధృవపు ఎలుగుబంట్లు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ప్రపంచ ధృవపు ఎలుగుబంట్ల రాజధానిగా పేర్కొంటారు.
ఈ ఎలుగు బంట్లు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తాయో ఎవ్వరికీ తెలియదు. అందుకే అక్కడి ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. వాటి నుంచి రక్షణ పొందడం కోసమే తమ కార్లను అన్ లాక్ చేసి ఉంచుతారు. సడన్ గా ఎలుగుబంట్లు వచ్చినప్పుడు అక్కడి పౌరులు దగ్గరిలో ఏ కార్ ఉంటె.. ఆ కార్ ఎక్కి తమ ప్రాణాలను కాపాడుకుంటారు. అలా అక్కడి పౌరులు ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. ఈ ఎలుగుబంట్లు నగరంలోకి రాకుండా ఉండడానికి అక్కడి అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాటి రాకను అడ్డుకోవడం కష్టమవుతోంది. ఆహరం కోసమే ఇవి నగరంలోకి వచ్చి భీబత్సం చేస్తూ ఉంటాయి.
End of Article