గుడిలో ఆభరణాలు దొంగతనం చేసాడు… పారిపోతూ అక్కడ ఇరుక్కుపోయాడు.. చివరికి ఏమైందంటే..?

గుడిలో ఆభరణాలు దొంగతనం చేసాడు… పారిపోతూ అక్కడ ఇరుక్కుపోయాడు.. చివరికి ఏమైందంటే..?

by Anudeep

Ads

మనకు లేదా మన చుట్టూ ఏదైనా చెడు జరిగినప్పుడు కొన్ని సార్లు కర్మ చేయాల్సిన న్యాయం చేస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే కర్మ తన పనిని పూర్తి చేసి ప్రపంచానికి న్యాయం చేయడాన్ని మీరు ప్రత్యక్షంగా చూశారా? ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.

Video Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఆలయంలో ఓ దొంగ ఆభరణాలను చోరీ చేసి, పూజా స్థలం నుంచి తప్పించుకోవాలని అనుకున్నాడు. అయితే తప్పించుకుంటుండగా.. రెండు గోడల మధ్యలో ఇరుక్కుపోయాడు.

thief

వివరాల్లోకి వెళితే, ఈ ఘటన శ్రీకాకుళం కంచిలి మండలం జదుపూడి గ్రామంలో చోటుచేసుకుంది. R పాపా రావు అనే ఓ దొంగ మద్యానికి బానిస అయ్యాడు. అందుకు డబ్బులు కోసం దొంగతనానికి అలవాటు పడ్డాడు. గ్రామంలోని జామి ఏలమ్మ ఆలయంలో గోడకు ఉన్న చిన్న రంధ్రం ద్వారా ఆలయంలో ఉన్న వెండి ఆభరణాలను దొంగిలించేందుకు ప్రయత్నించాడు.

thief 1

సుమారు 20 గ్రాముల వెండి ఆభరణాలను అపహరించిన అనంతరం దొంగ అదే దారిలో నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఈసారి చిన్న గుంతలో ఇరుక్కుపోయాడు. సహాయం కోసం కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీనితో ఆ దొంగ దిక్కు తోచని స్థితిలో ఉండిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ సూర్యారెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

thief 2

ఈ వీడియోలో చిన్న రంధ్రంలో ఇరుక్కుపోయిన దొంగ తనని బయటకి తీసుకురావాలంటూ స్థానికులను కోరుతున్నాడు. చిన్న వెంటిలేషన్ కిటికీ ద్వారా లోపలికి ప్రవేశించిన దొంగ బయటకు రాలేకపోయాడు. కాగా.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మద్యం కోసం పాపారావు దొంగతనానికి పాల్పడడం ఇది మొదటి సారి కాదని పేర్కొన్నారు. గతంలో కూడా ఇంట్లోంచి LPG సిలిండర్ ను దొంగిలించి అమ్మేసాడని పేర్కొన్నారు. చోరీకి గురైన వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, అతనిపై కేసు నమోదు చేశారు.


End of Article

You may also like