Ads
కోటి విద్యలు కూటి కోసమే అని అంటూ ఉంటారు. దొంగతనం అనేది విద్య కాకపోయినప్పటికీ.. ఇందులో ఆరితేరుతున్న వారు చాలా మందే ఉంటున్నారు. రకరకాల పద్ధతుల్లో దొంగతనం చేయడం వంటివి ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల చెన్నై విమానాశ్రయం వద్ద కొత్త రకం మోసం బయటపడింది.
Video Advertisement

ఇటీవల రకరకాలుగా బంగారం దోచుకెళ్తుండడం పట్టుబడుతున్న క్రమంలో.. తాజాగా మరోసారి ఈ దోపిడీ జరగడం కలకలం రేపింది. వివరం లోకి వెళితే.. కొందరు వ్యక్తులు చిన్నపిల్లలు ఎంతో ఇష్టం గా తాగే టాంగ్ పౌడర్ అమ్మే డబ్బాలలో బంగారపు రజను ను పోసుకుని తీసుకెళ్తూ పట్టుబడ్డారు.

చిన్న చిన్న ముక్కలను ముక్కుపుడక సైజ్ లో కట్ చేసి స్మగ్గ్లింగ్ చేయడానికి పాల్పడ్డారు. తాజాగా, వీరు తీసుకెళ్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయల విలువ చేసే బంగారాన్ని వీరు ఇలా టాంగ్ డబ్బాలలో పట్టుకెళ్ళడం గమనార్హం. ఈ బంగారం దాదాపు రెండున్నర కేజీల బరువు ఉందట. రాను రాను దోపిడీ ఎక్కువైపోతోంది కదా..
watch video:
End of Article
