Ads
సుధామూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు అయిన నారాయణ మూర్తి భార్య. ఈమె కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివారు. అంతే కాకుండా పలు రచనలు చేసారు. అనేక సామాజిక కార్యక్రమాలు చేయడం లో కూడా సుధా మూర్తి యాక్టీవ్ గా ఉంటారు. ఈమె ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండషన్స్ లో కీలక బాద్యతల్లో ఉన్నారు. ఈ నేపథ్యం లో ఈమెకు పలు అవార్డులు దక్కాయి.
Video Advertisement
అయితే సుధామూర్తి కోట్లకు అధిపతి అయినా చాలా నిరాడంబరంగా నే జీవిస్తారు. ఆ విషయం ఆమెను చూసిన వారికి అర్థం అయిపోతుంది. మాములుగా అటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తులు చాలా ఖర్చు పెడుతూ విలాసంగా జీవిస్తారు. కాని సుధా మూర్తి తనకు చేతనైనంతలో పేద వారికి ఉపయోగపడాలని ప్రయత్నిస్తారు.
ఈ నేపథ్యం లో ఒక ఇంటర్వ్యూ లో సుధా మూర్తి మాట్లాడుతూ తానూ షాపింగ్ చేసి చీరలు కొనుక్కొని 20 ఏళ్లకు పైగా అయ్యిందని వెల్లడించారు. ఎక్కువ బట్టలు ఉండటం వల్ల ఏం ఉపయోగం లేదని ఆమె పేర్కొన్నారు. “ఒక చీరని మనం ఎన్ని సార్లు కడతాం అనే విషయాల్ని గమనించిన తర్వాత ఎందుకు షాపింగ్ కి డబ్బు వృధా చెయ్యడం అని అనిపించింది. అయినా నాకు మా అమ్మ, నా చెల్లెల్లు చీరలు ఇస్తూ ఉంటారు. అందుకే నాకు షాపింగ్ చెయ్యాల్సిన అవసరం రాలేదు. ఒక చీర ఎంత ఖరీదు ఉన్న దానిలో మనకు కంఫర్ట్ లేకపోతే అది వృధానే..” అని సుధా మూర్తి ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు.
సుధా మూర్తి వద్ద కొన్ని బెనారసి, పైథానీలు, ఒరిస్సా సిల్క్స్, కేరళ సాఫ్ట్ కాటన్లు, ఆంధ్రప్రదేశ్ లో తయారైన చేనేత వస్త్రాలు ఉన్నాయి. వాటి విలువ అయిదువేల లోపే ఉండటం గమనార్హం. తనకి ఉన్న బట్టల్ని తానూ ఎలా పడితే ఆలా పడేయనని, వాటిని చక్కగా మైంటైన్ చెయ్యడం వల్లే ఇన్నాళ్లు మన్నుతున్నాయని ఆమె వెల్లడించారు. అంతే కాకుండా డిజైనర్ రీతూ బెరీ నుండి ఒక చీర బహుమతిగా వచ్చిందని ఆమె గతం లో తెలిపారు.
End of Article