Ads
సినిమాల్లో హీరో, హీరోయిన్, మిగిలిన నటులు మాత్రమే కాకుండా కొన్ని వస్తువులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అవి కూడా సినిమాలో కథ ముందుకి నడవడానికి సహాయపడతాయి. అలా కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్ర పోషించిన వస్తువులు ఏంటో, ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 జల్సా – కత్తి
జల్సా సినిమాలో ఒక కత్తి నేల నొప్పి వచ్చినప్పుడు విలన్ కి పెరాలసిస్ వస్తాయి. చివరిలో అదే కత్తిని మళ్లీ హీరో తొక్కినప్పుడు విలన్ చనిపోతాడు.
#2 అ! – చేప, బోన్సాయ్ చెట్టు
ఈ సినిమాలో చేప ఇంకా మొక్క ముఖ్య పాత్ర పోషించాయి. సినిమా చూస్తున్నంత సేపు ఇద్దరు మనుషులు మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. దానికి కారణం డబ్బింగ్ అనుకోండి. ఆ రెండింటిని కూడా ఈ సినిమాలో ఒక పాత్ర లాగానే ట్రీట్ చేశారు.
#3 క్రాక్ – మేకు, మామిడికాయ, నోట్
ఇందులో మామిడికాయతో మొదలైన కథ కి తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నోటు, మేకు కూడా యాడ్ అవుతాయి.
#4 మర్యాద రామన్న – సైకిల్
ఈ సినిమాలో సైకిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
#5 యమదొంగ – లాకెట్
ఇందులో కూడా హీరో హీరోయిన్ కలవడానికి అలాగే చాలావరకు కథ నడవడానికి ఆ లాకెట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
#6 శివ – సైకిల్ చైన్
శివ అంటే సైకిల్ చైన్ సైకిల్ చైన్ అంటే శివ అన్నట్టు అయ్యింది. అంటే ఆ సైకిల్ చైన్ అంత ట్రెండ్ క్రియేట్ చేసింది అన్నమాట. శివ సినిమా తర్వాత వేరే ఏ సినిమాలో అయినా సైకిల్ చూడంగానే సడన్ గా మనందరికీ శివ సినిమానే స్ట్రైక్ అవుతుంది.
#7 24 – వాచ్
సినిమా మొత్తం నడిచేది వాచ్ మీదే.
#8 జెర్సీ – జెర్సీ
అర్జున్ ని నాని జెర్సీ కొనివ్వమని అడగడం తోనే అసలు కథ మొదలవుతుంది.
#9 ఫిదా – చెప్పు
ఈ సినిమాలో వరుణ్ అడిగిన ప్రశ్నకి భానుమతి ఏం సమాధానం “చెప్పు”తుందో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.
#10 మనసంతా నువ్వే – మ్యూజిక్ వాచ్
ఈ సినిమాలో కూడా ఆ మ్యూజిక్ వాచ్ ఈ కథలో కీలక పాత్ర పోషించింది.
#11 టాక్సీ వాలా – కార్
టాక్సీ వాలా సినిమా లో శిశిర ఆత్మ కార్ లో చిక్కుకొని ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా మొత్తం ఆ కార్ చుట్టూనే తిరుగుతుంది.
#12 దేవుడు చేసిన మనుషులు – అరటి తొక్క
అరటి తొక్క కూడా ఒక సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించడం అనేది జరిగింది ఈ సినిమాతో మొదటి సారి ఏమో.
#13 హలో – మొబైల్
ఈ సినిమా మొత్తం ఒక మొబైల్ ఫోన్ చుట్టూ ఆ మొబైల్ ఫోన్ కి వచ్చిన కాల్ చుట్టూ తిరుగుతుంది.
#14 రైడ్ – బైక్
పేరుకి తగ్గట్టుగానే ఈ సినిమాలో బైక్ ఒక ముఖ్య పాత్ర పోషించింది.
#15 బ్రోచేవారెవరురా – బ్యాగ్
ఈ సినిమాలో బ్యాగ్ ఒక కీలక పాత్ర పోషించింది.
End of Article