Ads
మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.
భారత ప్రభుత్వం అందించే రెండవ ప్రతిష్టాత్మక అవార్డు ఇది. ఏదైనా రంగంలో అసాధారణమైన సేవలు చేసిన వ్యక్తులకు ఈ అవార్డును ప్రధానం చేస్తారు.
Video Advertisement
నిన్న మెగాస్టార్ చిరంజీవితో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి కూడా ఈ అవార్డును ప్రకటించారు. ఇద్దరు తెలుగు వాళ్ళకి ఈ అవార్డు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆనందం నెలకొంది.
చిరంజీవి కైతే నిన్న ఉదయం నుంచి అభిమానుల శుభాకాంక్షలు వెల్లువెత్తింది. సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అందరు చిరంజీవిని స్వయంగా వెళ్లి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక తెలుగువాడిగా చిరంజీవికి ఈ అవార్డు రావడం గర్వ కారణమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డుతో పాటు ఇంకేం రామే లభిస్తాయి అంటూ చాలామంది ఆరాల తీస్తున్నారు. చాలామందిలో ఒక అపోహ నెలకొంది.
చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం రాయితీలు అందుతాయని అనుకుంటున్నారు. అయితే పద్మ అవార్డులు పొందిన వారికి అలాంటి రాయితీలు ఏమి లభించవు. కేవలం దేశవ్యాప్తంగా గుర్తింపు గౌరవం వస్తాయి. బస్సులోను, రైళ్లల్లోనూ, విమానాల్లోనూ రాయితీలు లభిస్తాయని అంటున్నారు కానీ నిజానికి అలాంటి సదుపాయాలు అందజేయరు. నగదు ప్రోత్సాహం కూడా ఏమీ ఉండదు. అయితే పద్మ అవార్డులు పొందిన ప్రతి ఒక్కరూ రాష్ట్రపతిని నేరుగా వెళ్లి గెలిచే అవకాశం ఉంటుంది. ఈ అవార్డులు ప్రధానం చేసే రోజు రాష్ట్రపతి సంతకం తో ధ్రువీకరణ పత్రం అందజేస్తారు.
End of Article