Ads
“కత్తి మహేష్” మరణం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. కత్తి మహేష్ కి జరిగిన ఆక్సిడెంట్ పై కూడా ఇప్పటికే చాలా అనుమానాలు ఉన్నాయి. ముందు సీట్ లో ఉన్న డ్రైవర్ కంటే.. కత్తి మహేష్ కు ఎక్కువ గాయాలు తగలడం.. కోలుకుంటున్నారు అని చెప్పిన రెండు మూడు రోజులకే.. ఆయన ఈ లోకాన్ని వీడడం తో ఈ అనుమానాలు మరింత ముదిరాయి.
Video Advertisement
ఆయన మరణం పై థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి షాకింగ్ కామెంట్స్ చేసారు. సినిమాలు, రాజకీయాల్లో పృథ్వి చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. మహేష్ గురించి మాట్లాడుతూ.. తాను ప్రచారాల్లో పాల్గొనేటపుడు తనతో పాటు కత్తి మహేష్ కూడా వచ్చేవారని ఆరోజులను పృథ్వి గుర్తు చేసుకున్నారు. కత్తి మహేష్ మరణం గురించి బాధపడుతూ.. తనకు పలు అనుమానాలున్నాయన్నారు.
కారు ముందు ఉన్న వెహికల్ ని గుద్దితే.. డ్రైవర్ కి స్వల్ప గాయాలు అయ్యాయి. కత్తి మహేష్ కు తీవ్ర గాయాలు అవ్వడం పై పృథ్వి అనుమానం వ్యక్తం చేసారు. కారు తోలుతున్న డ్రైవర్ కు ఎటువంటి గాయాలు అవ్వకపోవడం పై అనుమానం వ్యక్తం చేసారు. తానె కనుక ఒక పోలీస్ ఆఫీసర్ ను అయ్యుంటే కచ్చితం గా ఈ కేసు ను టేకప్ చేసేవాడిని అని పేర్కొన్నారు.
కత్తి మహేష్ మరణం వెనుక ఎదో మతలబు ఉందని అన్నారు. తాను ఓ పోలీస్ ను అయ్యుంటే.. ఈ కేసు ను విచారించి.. ఆ మతలబు ఏమిటో తేల్చేవాడినని.. కత్తి మహేష్ మరణం వెనుక కారణం ఏంటో తెలిపేవాడినని పృథ్వి చెప్పుకొచ్చారు. తాను లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు కూడా కత్తి మహేష్ తనకు మద్దతు గా నిలిచారని ఈ సందర్భం గా పృథ్వి గుర్తు చేసుకున్నారు. నిజం గా ఓ మంచి స్నేహితుడిని కోల్పోయానని ఆయన బాధపడ్డారు.
End of Article