Ads
మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ సందర్భంగా పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. ఈ వార్త విని యావత్తు మెగా అభిమానులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు. చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలకి, నటనలో ఆయన కష్టానికి దక్కిన ప్రతిఫలంగా చెప్పుకుంటున్నారు. 2006 సంవత్సరంలో చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు రాగా ఇప్పుడు అదనంగా పద్మ విభూషణ్ వచ్చి చేరింది.
Video Advertisement
నిన్న సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు అందరూ చిరంజీవికి అభినందనలు తెలియజేశారు. నిజంగా ఒక తెలుగువాడిగా ఈ అవార్డు పొందడం మనందరం గర్వించదగ్గ విషయం.
ఈ విషయం మీద కామెంట్స్ వస్తున్నాయి. అయితే చిరంజీవిలాగే నటనలో మలయాళం మెగాస్టార్ అనిపించుకున్న మమ్ముట్టి కూడా ఉన్నారు. ఆయన కూడా యాక్టింగ్ లో చిరంజీవికి ఏమాత్రం తీసిపోరు. పలుభాష చిత్రాల్లో కూడా మమ్ముట్టి నటిస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం మమ్ముట్టికి గతంలో పద్మశ్రీ అవార్డును ప్రధానం చేసింది. మమ్ముట్టి చేసే సినిమాలు కూడా సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఉంటాయి. అన్ని రకాల సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. కళారంగానికి విశిష్టమైన సేవలు కూడా చేశారు.
తన కెరీర్ లో మమ్ముట్టి కూడా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. మమ్ముట్టి వయసు ఇప్పుడు 72 సంవత్సరాలు. ఇంత వయసు వచ్చినా సరే అవన్నీ పట్టించుకోకుండా కష్టపడుతూ సినిమాలు చేస్తూ ఉంటారు. భారత దేశంలో ఉన్న గొప్ప నటుల ప్రస్తావన వస్తే గుర్తు వచ్చే నటుల్లో మమ్ముట్టి కూడా ఉంటారు. డబ్బింగ్ సినిమాలు అయినా కూడా మమ్ముట్టికి తెలుగులో చాలా మంది అభిమానులు ఉన్నారు. కొన్ని తెలుగు సినిమాల్లో నటించినప్పుడు, లేదా ఇతర భాష సినిమాల్లో నటించినప్పుడు మమ్ముట్టి తన వాయిస్ తనే డబ్బింగ్ చెప్పుకుంటారు.
అంత అంకితభావం ఉన్న యాక్టర్ మమ్ముట్టి. చిరంజీవికి అవార్డు రావడం నిజంగా సంతోషించే విషయమైనా కూడా అంతే సమానమైన హోదా ఉన్న మమ్ముట్టి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించి ఉంటే బాగుండేది అని కళా విశ్లేషకులు అంటున్నారు. మమ్ముట్టి కూడా ఈ గౌరవానికి అర్హుడని అంటున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని వచ్చేసారైనా మమ్ముట్టికి గౌరవాన్ని అందిస్తే సినీ అభిమానులు అందరూ సంతోషిస్తారు
End of Article