రాజకుమారుడు నుండి సరిలేరు వరకు…మహేష్ బాబు సినిమాలో ఆ నటుడు ఉంటే సినిమా హిట్టే.!

రాజకుమారుడు నుండి సరిలేరు వరకు…మహేష్ బాబు సినిమాలో ఆ నటుడు ఉంటే సినిమా హిట్టే.!

by Mounika Singaluri

Ads

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా గుంటూరు కారం సినిమా రిలీజ్ కి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. గుంటూరు కారం సినిమా రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక కొత్త సెంటిమెంట్ తెరమీదకి వచ్చింది అదే ప్రకాష్ రాజ్ మహేష్ బాబు కాంబినేషన్ ఉంటే ఆ సినిమా హిట్టే అంటూ వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఉన్న సినిమాలు చిట్టా మొత్తం తీస్తున్నారు నెటిజెన్స్. వీరిద్దరూ కలిసి నటించే సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది.

Video Advertisement

ప్రకాష్ రాజ్ సినిమాలో ఉంటే మహేష్ బాబు కి సెంటిమెంట్ పరంగా వర్క్ అవుట్ అవుతుంది అంటున్నారు. రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు మహేష్ బాబు మొదటి సినిమాతోనే ప్రకాష్ రాజ్ తో కాంబినేషన్ పడింది. ఆ సినిమా పర్వాలేదనిపించుకుంది తర్వాత వంశీ సినిమాలో నటించారు మహేష్ కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది ముచ్చటగా మూడోసారి యువరాజు సినిమాలో నటించారు కానీ ఈ సినిమా యావరేజ్ ట్రాకింగ్ సొంతం చేసుకుంది అందులో ప్రకాష్ రాజ్ లేకపోవటమే కారణం అంటూ అప్పట్లో కామెంట్స్ వచ్చాయి.

ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మురారి సినిమాలో నటించగా అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తరువాత నిజం సినిమాలో వీరిద్దరూ కలిసి నటించినప్పటికీ యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది ఆ తర్వాత ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆపై వచ్చిన స్పైడర్, బ్రహ్మోత్సవం, నాని, అతిధి, వన్ నేనొక్కడినే, ఆగడు వంటి సినిమాలలో ప్రకాష్ రాజు నటించలేదు అందుకే ఈ సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి అంటూ సెంటిమెంట్ ని జోడించి ప్రచారం చేశారు చాలామంది.

పోకిరి, దూకుడు వంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి అంటే అందులో ప్రకాష్ రాజ్ ఉన్నారు. మరి ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో ప్రకాష్ రాజ్ లేరు సెంటిమెంటు రిపీట్ అవుతుందా లేదంటే శ్రీమంతుడు సినిమా లాగా మంచి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందా అనేది కొన్ని గంటలలో తెలిసిపోతుంది. శ్రీమంతుడు సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ నటించ లేదు.


End of Article

You may also like