BALAKRISHNA : ఒకప్పుడు బాలయ్య పక్కన చైల్డ్ ఆర్టిస్ట్…తర్వాత హీరోయిన్…ఇప్పుడు విలన్..ఆ నటి ఎవరంటే.?

BALAKRISHNA : ఒకప్పుడు బాలయ్య పక్కన చైల్డ్ ఆర్టిస్ట్…తర్వాత హీరోయిన్…ఇప్పుడు విలన్..ఆ నటి ఎవరంటే.?

by Mohana Priya

Ads

సాధారణంగా ఒక పెద్ద హీరోకి ఒక సంవత్సరంలో రెండు సినిమాలు విడుదల చేయడం అనేది కష్టమైన విషయం అయిపోయింది. అలాంటిది గత సంవత్సరం రెండు సినిమాలు విడుదల చేసి, ఆ రెండు సినిమాలతో హిట్ కొట్టిన హీరో నందమూరి బాలకృష్ణ.

Video Advertisement

బాలకృష్ణ ఇప్పుడు కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. గత సంవత్సరం విడుదల అయిన వాల్తేరు వీరయ్య సినిమాతో అందుకున్నారు బాబీ. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ సినిమాకి దర్శకత్వం చేసే అవకాశం దక్కించుకున్నారు.

అయితే, ఈ సినిమాకి సంబంధించి మిగిలిన విషయాలు ఏవి బయటికి రాలేదు కానీ, ఈ సినిమాలో ఒక నటి కీలక పాత్ర పోషిస్తున్నారు అనే వార్త మాత్రం ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఆ నటి అంతకుముందు బాలకృష్ణతో చైల్డ్ ఆర్టిస్ట్ గా, ఆ తర్వాత హీరోయిన్ గా కూడా నటించారు. ఇప్పుడు ఈ సినిమాలో మాత్రం విలన్ పాత్ర పోషిస్తున్నారు అనే వార్త వచ్చింది. ఆ నటి ఎవరో కాదు. హీరోయిన్ రాశి. చిన్నతనంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసి, ఆ తర్వాత హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు.

నిజం సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రలో నటించారు. ఆ తర్వాత సహాయ పాత్రల్లో నటించడం మొదలు పెట్టారు. జానకి కలగనలేదు సీరియల్ లో కూడా రాశి నటించారు. ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. బాలకృష్ణ సినిమాలో రాశి విలన్ పాత్ర పోషిస్తున్న నటుడికి భార్యగా నటిస్తున్నారు. అయితే రాశి పాత్రలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉంటాయి అని సమాచారం. మరొక శివగామి పాత్ర లాగా ఈమె పాత్ర కూడా ఉంటుంది అని అంటున్నారు. రాశి, బాలకృష్ణ హీరోగా నటించిన బాలగోపాలుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వాత కృష్ణ బాబు సినిమాలో బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా నటించారు.

this actor to act in balakrishna movie

ఇప్పుడు మళ్లీ బాలకృష్ణ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. రంగస్థలంలో మొదట అనసూయ పాత్రకి రాశిని అనుకున్నారు అనే విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల రాశి ఆ పాత్ర చేయలేకపోయారు. మధ్యలో సీరియల్స్ లో కూడా అలరించిన రాశి ఇప్పుడు మళ్లీ చాలాకాలం తర్వాత బాలకృష్ణ కాంబినేషన్ లో ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.ఈ విషయం మీద అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారు అని సమాచారం. అందులో ఒక హీరోయిన్ తమన్నా అని ప్రచారంలో ఉంది.

ALSO READ : SALAAR: సలార్ సినిమాలో ప్రభాస్ అందుకే గొడ్డు కారం తింటాడా..? ఈ కారణం తెలుస్తే నవ్వాపుకోలేరు.!


End of Article

You may also like