Ads
మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో. ఆయనతో సినిమా చేయాలని చాలా మంది హీరోయిన్లు అనుకుంటూ ఉంటారు. ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో మహేష్ బాబు పని చేశారు. అయితే మహేష్ బాబు తో నటించిన ఒక హీరోయిన్ మాత్రం తనని చాలా బాధ పెట్టిందట.
Video Advertisement
ఏకంగా మహేష్ బాబుకి ఏడుపు కూడా వచ్చేసింది. మరి ఆమె ఎవరో చూద్దాం. మహేష్ బాబు అర్జున్ సినిమా మనకి ఇంకా గుర్తు ఉండే ఉంటుంది. ఆ సినిమాలో మహేష్ బాబు చెల్లెలుగా కీర్తి రెడ్డి నటించారు. కేవలం సినిమాల్లోనే కాదు బయట కూడా కీర్తి రెడ్డి ఎప్పుడూ మహేష్ ని అన్నయ్య గానే భావించారట. రాఖీ పండగ వస్తే కూడా మహేష్ బాబుకి కీర్తి రెడ్డి రాఖీ కట్టారట. ఇలా అర్జున్ సినిమాతో వీళ్లిద్దరి మధ్య అన్నాచెల్లెళ్ల బంధం ఏర్పడింది.
ఆ తర్వాత అక్కినేని వారసుడు సుమంత్ ను వివాహం చేసుకుంది. ఏడాది తర్వాత ఈ జంట విడిపోయారు. వీళ్ళు విడిపోవడం మహేష్ కి అస్సలు ఇష్టం లేదట. ఒప్పించడానికి కూడా చూశారట. కానీ చివరికి వాళ్ళు విడిపోయారు. దీనితో మహేష్ బాబుకి చాలా బాధ కలిగింది. సుమంత్ తో కలిసి ఉండనని కీర్తి రెడ్డి మహేష్ మాటని కూడా లెక్క చేయలేదట. దీంతో మహేష్ బాబు ఎంతగానో బాధ పడ్డారు.
End of Article