ప్రభాస్ “రాజా డీలక్స్” సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోయిన్..?

ప్రభాస్ “రాజా డీలక్స్” సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోయిన్..?

by Mohana Priya

Ads

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో ప్రభాస్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇది మాత్రమే కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నారు.

Video Advertisement

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టిల్స్ కూడా బయటకు వచ్చాయి. అవి చాలా వైరల్ అయ్యాయి.

fans planning to re rease 3 films of prabhas on his birthday..

ఇవన్నీ మాత్రమే కాకుండా ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా ఒక హారర్ కామెడీ సినిమాగా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు పూర్తయినట్టు సమాచారం. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మాళవిక మోహనన్ ఒక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా నటిస్తున్నారని సమాచారం.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న నిధి అగర్వాల్ కూడా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు అని సమాచారం. అలా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అన్నమాట. ఈ సినిమాపై సినిమాకి సంబంధించి ఒక్కరు కూడా మాట్లాడలేదు.

nidhi agarwal

మరి ఇలా సైలెంట్ గా వచ్చి హిట్ కొడతారేమో అని చాలామంది అంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి బయటికి వచ్చిన విషయంలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే సినిమా బృందం ప్రకటించేంత వరకు ఆగాల్సిందే.


End of Article

You may also like