అచ్చం నయనతారలా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది.. ఏ సినిమాలో అంటే..?

అచ్చం నయనతారలా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది.. ఏ సినిమాలో అంటే..?

by Anudeep

Ads

ఈ ఫోటో లో ఉన్న అమ్మాయిని చూసారా..? అచ్చం నయనతారలా ఉంది కదా. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉన్నారని అంటుంటారు. ప్రతి మనిషిని పోలిన మనుషులు ఉంటూనే ఉంటారు. అయితే ఒక సెలెబ్రిటీని పోలిన మరో వ్యక్తిని చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ సెలెబ్రిటీని పోలిన వ్యక్తి కూడా మరో సెలెబ్రిటీ అయితే..? అది ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. అది ఎవరో మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Video Advertisement

 

ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు అనిఖా సురేంద్రన్. ఆమె చాలా ఫొటోస్ లో నయనతారని పోలి కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఈమె కూడా సెలెబ్రిటీనే. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీ లో కెరీర్ ను స్టార్ట్ చేసింది. 2015 లో తమిళ్ స్టార్ అజిత్ హీరోగా, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన యెన్నై అరిందాల్ సినిమాతో తమిళంలో కూడా పరిచయమైంది అనిఖా. ఈ సినిమాలో త్రిష కూతురుగా నటించింది అనిఖా. ఇదే సినిమా తెలుగులో ఎంతవాడుగాని పేరుతో డబ్ అయింది. అలా అనిఖా మనందరికీ కూడా సుపరిచితురాలు అయ్యింది.

anikha 1

తర్వాత కొన్ని తమిళ్, మలయాళం సినిమాల్లో నటించింది. 2019 లో అజిత్ హీరోగా వచ్చిన విశ్వాసం సినిమా తెలుగులో కూడా అదే పేరుతో డబ్ అయింది. ఈ సినిమాలో అజిత్ – నయనతార కూతురుగా నటించింది అనిఖా. అలా అనిఖా విశ్వాసం సినిమా ద్వారా మన అందరికీ ఇంకా చేరువైంది.

anikha 2

అలాగే జయలలిత గారి జీవితం ఆధారంగా వచ్చిన క్వీన్ వెబ్ సిరీస్ లో యంగ్ జయలలిత గారి పాత్ర పోషించింది అనిఖా. ఇన్ని సంవత్సరాల్లో తన నటనకి గాను ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. ఇప్పుడు అనిఖా ఒక డైరెక్ట్ తెలుగు సినిమాతో మనల్ని పలకరించబోతోంది అనే వార్త వినిపిస్తోంది. ఈ ఏడాది మొదట్లో విడుదలైన మలయాళ సినిమా కప్పేలా.

 

anikha 3
ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్, నవీన్ చంద్ర హీరోలుగా నటించబోతున్నారు. మలయాళంలో అన్నా బెన్ పోషించిన హీరోయిన్ పాత్రని తెలుగులో అనిఖా చేయబోతోంది అని సమాచారం. కప్పేలా తెలుగు రీమేక్ కి సంబంధించిన వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

anikha 4


End of Article

You may also like