నేషనల్ అవార్డ్ విజేతని “బ్యాక్‌గ్రౌండ్‌ ఆర్టిస్ట్” చేశారుగా..? ఎవరంటే..?

నేషనల్ అవార్డ్ విజేతని “బ్యాక్‌గ్రౌండ్‌ ఆర్టిస్ట్” చేశారుగా..? ఎవరంటే..?

by Mohana Priya

Ads

కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలు కనిపిస్తూ ఉంటారు. ఆ పాత్రల కోసం ఒక్కొక్కసారి హీరోలు, హీరోయిన్లు చేస్తూ ఉంటే, ఇంకొకసారి డైరెక్టర్లు చేసేస్తారు. అలా చాలా సినిమాల్లో డైరెక్టర్లు కొన్ని పాత్రల్లో నటించారు.

Video Advertisement

కొంత మంది డైరెక్టర్లని మనం సినిమా చూసినప్పుడు గుర్తుపట్టలేము. కానీ తర్వాత సినిమా టీవీలో చూస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ ని గుర్తుపడతాం. ఇటీవల అలా ప్రభాస్ నటించిన ఒక సినిమాలో ఆ సినిమా డైరెక్టర్ నటించారు.

అది కూడా బాహుబలికి ముందు. ప్రభాస్ నటించిన సినిమాలో ఆ డైరెక్టర్ కనిపిస్తారు. ఆయన మరెవరో కాదు. వంశీ పైడిపల్లి. ప్రభాస్ హీరోగా నటించిన మున్నా సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు అనే సంగతి తెలిసిందే. ఇదే వంశీ పైడిపల్లి మొదటి సినిమా. ఈ సినిమాలో వేణుమాధవ్ తో ఉన్న ఒక సీన్ లో వంశీ పైడిపల్లి కనిపిస్తారు. వంశీ పైడిపల్లి అంతకుముందు వర్షం సినిమాలో కూడా ప్రభాస్, త్రిష ప్రయాణిస్తున్న బస్ లో ఒక ప్యాసింజర్ గా కనిపిస్తారు.

this director acted as background artist in munna

ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఆ తర్వాత మున్నా సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత బృందావనం, ఎవడు, ఊపిరి సినిమాలకి దర్శకత్వం వహించారు. మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి తలపతి విజయ్ హీరోగా నటించిన వారిసు సినిమాకి దర్శకత్వం వహించారు.

who is the akhil's next movie director..!!

ఈ సినిమా తమిళ్ సినిమా అయినా కూడా, తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా వచ్చి ఏడాది అయ్యింది. వంశీ పైడిపల్లి తన నెక్స్ట్ సినిమా ఇంకా ప్రకటించలేదు. విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తున్నారు అనే వార్త వచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబుతోనే మరొక సినిమా చేస్తారు అనే వార్త కూడా వచ్చింది. ఇంకా చాలా మంది హీరోల పేర్లు ఇలాగే వచ్చాయి. మరి నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తారు అనేది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.

watch video :

https://www.instagram.com/reel/C2Tmj6ZpQs8/?utm_source=ig_web_copy_link

ALSO READ : వెండితెర పై హీరో గా అడుగు పెట్టాలనుకున్న నారాలోకేష్.. జస్ట్ మిస్.. అసలేం జరిగిందంటే..?


End of Article

You may also like