Ads
కొన్ని కొన్ని సంఘటనలు ఎలాంటి పరిస్థితుల్లో చోటు చేసుకుంటాయి అన్న సంగతి చెప్పలేం. అనుకోకుండా మనం చేసే పనుల వల్ల చివరకు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. అలా చేయకపోయి ఉంటె బాగుండేది.. అని మనలో మనం ఎన్ని మాటలు అనుకున్న ఉపయోగం ఉండదు.
Video Advertisement
ఇటీవల రష్యాకు ఉక్రెయిన్ కు మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతీయులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఓ భారతీయ విద్యార్థి నవీన్ సరుకుల కోసం బయటకి వచ్చి కాల్పుల్లో చనిపోయిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో అతను బయటకి రాకపోయి ఉంటె.. పరిస్థితి మరోలా ఉండేది. అతను బట్టకట్టి ఉండేవాడేమో.. తాజాగా.. ఇలాంటి పరిస్థితి నవీన్ సొంత రాష్ట్రమైన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఓ అమ్మాయి పళ్ళు తోముకోవడం వలన ప్రాణాలు కోల్పోయింది. ఆశ్చర్యంగా ఉంది కదా.. ఆమె పళ్ళు తోముకునేటప్పుడు పేస్ట్ కి బదులుగా పొరపాటున తెలుపు రంగులో ఉన్న ఎలుకల మందు క్రీం ను తీసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో సూళ్య జిల్లా మర్కంజా గ్రామానికి చెందిన శ్రావ్య టౌన్ లో ఉండే ప్రియునివెర్సిటీ లో చదువుకుంటోంది. అయితే గత నెలలో జరిగిన హిజాబ్ వివాదం కారణంగా అన్ని కాలేజీలు మూతపడ్డాయి. ఈ క్రమంలో శ్రావ్య కూడా అందరిలానే ఇంటికి వచ్చేసింది. ఫిబ్రవరి 14 వ తేదీన పడుకునే ముందు బ్రష్ చేసుకుంది. అయితే.. పేస్ట్ కి బదులు ఎలుకల మందు క్రీం తో పొరపాటుగా బ్రష్ చేసుకుంది.
ఆమెకు బ్రష్ చేసేటప్పుడు తేడాగా అనిపించి.. నోటిని చాలా సార్లు పుక్కిలించి నీటిని బయటకు వదిలేసింది. నిజానికి ఎలుకలను చంపడానికి వాడే ఎలుకల మందు మనుషులకు కూడా ప్రాణాంతకమైనదే. అయితే.. దానితో బ్రష్ చేసుకోవడం వలన కొన్ని గంటల తరువాత శ్రావ్య తీవ్ర అస్వస్థతకు గురి అయ్యింది. అయితే రెండు రోజుల వ్యవధిలోనే ఆమె పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారడంతో ఆమెను మంగళూరు హాస్పిటల్ కి తీసుకెళ్లారు. రెండు వారాల పాటు చికిత్స తీసుకున్నా ఆమె కోలుకోలేకపోయింది. గత ఆదివారం ఆమె ప్రాణాలు విడిచింది.
End of Article