Ads
నేటి కాలంలో మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు చదువుకుంటున్నారు…. వాళ్ళ యొక్క ఆశయాలని అందుకోవాలని నడుస్తున్నారు… అనుకున్నది సాధించాలనే పట్టుదలతో పయనిస్తున్నారు… అదే తీరులో నడిచిన ఒక అమ్మాయి నిజంగా ఎందరికో ఆదర్శంగా నిలిచింది.
Video Advertisement
ద బెటర్ ఇండియా కధనం ప్రకారం SSC లో ఆమె 86% మార్కులు తెచ్చుకుంది. దీంతో అందరూ ఆమె సైన్స్ వైపు వెళుతుంది ఏమో అని అనుకున్నారు. బంధువులు అయితే డాక్టర్ అవుతుందేమో అని అనుకున్నారు. కానీ ఆమె ఎదుటి వాళ్లు ఏమనుకుంటారు..?, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు సైన్స్ వైపు వెళ్లాలేమో..? ఇలాంటి ప్రశ్నలు ఏమీ లేకుండా ఆమెకు నచ్చిన దారిలో ఆమె వెళ్లింది.
ఆమెకి ఆర్ట్స్, కల్చర్ మరియు లిటరేచర్ అంటే ఇష్టం. అందుకనే ఆమె జర్నలిజంని ఎంచుకుంది. ఇప్పుడు ఆమె బేకరీ ని నడుపుతోంది. పైగా ఇది చాలా సులభం. నాకు నచ్చిన దారిలో నేను వెళ్తున్నాను అని ఆమె సమాధానమిచ్చింది. నిజంగా ఆమెలో వున్న ఒక్క విషయాన్ని మెచ్చుకోవాలి. అదేంటంటే.. ఎవరికి నచ్చిన తీరు వాళ్లది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుసరించాలి అంతేకానీ ఎదుటి వాళ్లు ఏమనుకుంటారు అని ఏ మాత్రము ఆలోచించకూడదు. మనకి నచ్చింది మనం చేస్తే మనం దానిని తప్పకుండా సాధించగలం అని ఆమె ధృడంగా నమ్ముతోంది.
కెరీర్ విషయంలోనైనా రిలేషన్షిప్ లో అయినా అంతే అని ఆమె అంది. సొసైటీ కొన్ని రకాల రూల్స్ ని పెడుతుంది. దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ అనుసరించాలని అనుకుంటే పొరపాటు. మనకంటూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. మనకు నచ్చినట్లు మనం వెళ్ళాలి. అప్పుడే మనం ఏదైనా చేయగలం పైగా అమ్మాయి అంటే ఇలా పద్ధతిగా బట్టలు వేసుకోవాలి వంటివి చాలా కండీషన్స్ ఉంటాయి.
కానీ ఆమె ఒక్కటే చెప్పింది కంఫర్టబుల్ గా ఉన్న బట్టలు వేసుకోవాలి. ఎప్పుడు కూడా నేను దానికే ప్రయారిటీ ఇస్తానని ఆమె చెప్పుకొచ్చింది. పైగా ఆమెకి కొద్దిగా జుట్టునెరిసింది. కానీ ఆమె రంగు వేసుకోలేదు. ఇది నా యొక్క సొంత నిర్ణయం అని ఆమె అంది. మనకి నచ్చింది మనం చేయడం అనేది చాలా ముఖ్యం.
ఒకవేళ కనుక మనకి నచ్చిన దానిని చేసినప్పుడు తప్పులు చేసినా.. అది మీకు నచ్చి చేశారు కాబట్టి నేర్చుకుని పర్ఫెక్ట్ గా ఉండడానికి చూస్తారు. అంతే కానీ తప్పు చేసి ఆఖరికి ఎటు వెళ్ళాలో తెలియక మధ్యలోనే ఉండిపోరు. ఇలా ఉంటే పడినా లేస్తూ ఉంటాము. అయితే సొసైటీ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండటం అనేది ఓ ట్రాజిడీ అని ఆమె చెప్పింది.
End of Article