Ads
మనం సినిమా నచ్చితే ఏ భాషలో అయినా సరే ఒకేలాగా ఆదరిస్తాం. అందుకే మన భాషలోని సినిమాలు వేరే భాషల్లోకి, వేరే భాషల సినిమాలు మన భాషలోకి డబ్ చేస్తూ ఉంటారు. తెలుగులోకి డబ్ అయ్యే సినిమాలు ఎక్కువగా తమిళ్ భాష నుంచి అవుతాయి.
Video Advertisement
తమిళ్ హీరోలు అయిన సూర్య, విక్రమ్, అజిత్, విజయ్, కార్తీ, విశాల్ వీళ్ళందరికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా క్రేజ్ ఉంది. అందుకే ఆ తమిళ హీరోలు కూడా తెలుగులో సినిమాలు విడుదల చేయడంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
వీరిలో కార్తీకి దాదాపు ఒక తెలుగు హీరోకి ఉన్నంత క్రేజ్ ఉంది. కార్తీ ఊపిరి తో డైరెక్ట్ తెలుగు సినిమాలో కూడా నటించారు. అంతే కాక కార్తీ తెలుగులో తన సినిమాలకి తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు కార్తీ మరొక తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నట్టు సమాచారం. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో విలన్ పాత్ర కోసం కార్తీని సంప్రదించారట.
రాజమౌళి సినిమా కావడంతో కార్తీకి తన పాత్ర కూడా బాగా నచ్చడంతో ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది కూడా తెలియదు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ పనిలో ఉన్నారు. అలాగే ఒక పని మీద విదేశాలకి వెళ్లారు. వచ్చిన తర్వాత ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
End of Article