Ads
దర్శకు ధీరుడు రాజమౌళి క్రేజ్ విశ్వవ్యాప్తంగా పెరిగిపోయింది ఆయనతో సినిమా చేయడానికి బాలీవుడ్ హీరోలు సైతం సిద్ధంగా ఉన్నారు. అయితే రాజమౌళి తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్నారు అనే సంగతి తెలిసిందే.
Video Advertisement
ఇప్పటికే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు. ఈ మూవీ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ అంటూ ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే తెలియజేశారు.
ఈ సినిమా షూటింగ్ ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ లొకేషన్ లో కూడా షూట్ చేస్తారని అంటున్నారు. ఇప్పటికే ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చున్నారట. ఈ సినిమా 2024 సంవత్సరం చివరికి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమా చేయనున్నారు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ రాజమౌళి సినిమానే మహేష్ మొదలుపెడతారు.
అయితే మహేష్ రాజమౌళి సినిమాలో నటించే హీరోయిన్ గురించి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి న్యూస్ రాలేదు. అయితే తాజాగా టాలీవుడ్ లో ఒక న్యూస్ వైరల్ అయింది.సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దు గుమ్మను తీసుకోవాలని జక్కన్న పట్టుబడుతున్నాడట. పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కీలకమని తెలుస్తోంది. ఇక ఈ హీరోయిన్ కోసం దర్శక ధీరుడు రాజమౌళి తెగ వెతుకుతున్నారని తెలుస్తోంది.
కాగా ఇందుకోసం జక్కన్న ఇప్పటికే బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంకను కలిసి రెండు సార్లు ఆమెతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
End of Article