అప్పుడు “జూనియర్ ఎన్టీఆర్” కి జోడీగా నటించిన హీరోయిన్ … ఇప్పుడు తల్లిగా..? ఎవరంటే..?

అప్పుడు “జూనియర్ ఎన్టీఆర్” కి జోడీగా నటించిన హీరోయిన్ … ఇప్పుడు తల్లిగా..? ఎవరంటే..?

by Mohana Priya

Ads

కంటెంట్ బాగుంటే సినిమాలను క్రేజీగా చూస్తున్నారు ప్రేక్షకులు. దీంతో భాషతో సంబంధం లేకుండా…పాత్ర ఏదైనా సరే పట్టించుకోకుండా.. స్టార్ హీరోయిన్స్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Video Advertisement

అందుకే కీర్తి సురేష్ ,నయనతార లాంటి హీరోయిన్లు చిరంజీవి పక్కన చెల్లెలు క్యారెక్టర్ చేయడానికి కూడా వెనకాడడం లేదు. సిస్టర్ క్యారెక్టర్ వరకు పర్లేదు.. కానీ ఏకంగా ఒకప్పుడు ఎన్టీఆర్ తో హీరోయిన్ గా చేసి ఇప్పుడు అతని తల్లి క్యారెక్టర్ కి ఓకే చెప్పింది ఒక నటి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర . ఇందులో ఎన్టీఆర్ కు తల్లి క్యారెక్టర్ లో నటించనున్న హీరోయిన్ ఎవరో కాదు ప్రియమణి. అవునండి ఇదే ప్రియమణి ఎన్టీఆర్ తో యమదొంగ చిత్రంలో హీరోయిన్ గా చేసింది. ఆ మూవీలో వాళ్ళిద్దరూ మధ్య సాంగ్స్, స్టెప్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. మొన్నటికి మొన్న షారుక్ ఖాన్ జవాన్ చిత్రంలో సౌత్ స్టార్స్ పవర్ చూపించింది. ఎన్టీఆర్ అమ్మ క్యారెక్టర్ కి ప్రియమణిని తీసుకోబోతున్నట్లు ఒక న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది విని చాలా మంది షాక్ కి కూడా గురి అవుతున్నారు మరి. అయితే దేవర మూవీలో ఎన్టీఆర్ అమ్మ క్యారెక్టర్ లో ప్రియమణి అతని చిన్నప్పటి సమయంలో కనిపిస్తుంది. అంటే అప్పటికి ఎన్టీఆర్ ..ఎన్టీఆర్ లాగా ఉండడు.. ఏదో ఒక చిన్న పిల్లాడి లాగా ఉంటాడు కాబట్టి పర్లేదని సరిపెట్టుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో ఒక చిన్న డిస్కషన్ జరుగుతోంది. కత్తిలాంటి పాపను అమ్మ క్యారెక్టర్ కి ఎట్లా సెట్ చేశావయ్యా…అంటూ నెటిజెన్స్ కొరటాల శివ పై కామెంట్స్ పెడుతున్నారు.

ALSO READ : “రాశి ఖన్నా” కి ఏమయ్యింది..? తెలుగు సినిమాలకి ఎందుకు దూరం అయ్యారు..?


End of Article

You may also like