మొదటి సినిమాతోనే పాపులర్ అయ్యే నటులు చాలా తక్కువ. కొంత మందికి ఎన్నో సినిమాలు చేసి, ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ ఒక గుర్తింపు రాదు. అలా మొదటి సినిమాతోనే గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రాశి ఖన్నా.

Video Advertisement

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే, ఇటు నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు కూడా చేస్తూ వెళ్లారు.

కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా, ఆ తర్వాత వచ్చే సినిమాలతో హిట్ కొడుతూ తెలుగులో స్టార్ హీరోయిన్స్ లో ఒకరు అయ్యారు. ఒక సమయం వరకు కాస్త బొద్దుగా ఉన్న రాశి ఖన్నా తర్వాత సన్నబడి తొలి ప్రేమతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యారు. అప్పటి నుండి దాదాపు ఒక నాలుగు సంవత్సరాలు వరుసగా సినిమాలు చేశారు. అందులో చాలా సినిమాలు హిట్ అయ్యాయి. తర్వాత మెల్లగా తెలుగులో సినిమాలు చేయడం తగ్గించేశారు.

What happened to rashii Khanna

తెలుగులో సినిమాలు చేస్తూనే రాశి ఖన్నా తమిళ్ లో కూడా సినిమాలు చేశారు. తెలుగులో చివరిగా థాంక్యూ సినిమాలో రాశి ఖన్నా నటించారు. ఈ సినిమా వచ్చి దాదాపు సంవత్సరం అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ ఒక్క తెలుగు సినిమాలో కూడా కనిపించలేదు. ఈ మధ్యలో హిందీలో వెబ్ సిరీస్ లో నటించారు. డబ్బింగ్ తమిళ్ సినిమాలతో అప్పుడప్పుడు అలరిస్తున్నారు. కానీ రాశి ఖన్నా ఒక తెలుగు సినిమా చేసి చాలా కాలం అయ్యింది. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత రాశి ఖన్నాకి తెలుగులో చెప్పుకోదగ్గ హిట్ సినిమా కూడా లేదు.

What happened to rashii Khanna

ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని పక్కా కమర్షియల్ సినిమాలో నటించారు. ఇది కూడా ఆశించిన ఫలితాన్ని పొందలేదు. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన థాంక్యూ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. రాశి ఖన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఫోటో షూట్ చేసి, ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అలా ఇటీవల కూడా కొన్ని ఫోటోలని షేర్ చేశారు. రాశి ఖన్నా చేతిలో ప్రస్తుతం ఒక హిందీ సినిమాతో పాటు, రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. మరి తెలుగులో ఎప్పుడు నటిస్తారో తెలియాలి అంటే వెయిట్ చేసి చూడాల్సిందే.