Ads
మాస్ మహారాజ రవితేజ మరియు ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
Video Advertisement
వీళ్ళిద్దరి క్రేజీ కాంబోలో త్వరలో ఇంకో చిత్రం రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఈ చిత్రం బాలీవుడ్ లో మంచి కలెక్షన్స్ రాబట్టిన ఒక సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ అని తెలుస్తుంది.
ఈ సంవత్సరం వాల్తేరు వీరయ్య మరియు రావణాసుర లాంటి రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో బరిలోకి దిగిన రవితేజ ఈ తాజా రీమేక్ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ అది ఏ చిత్రం అనుకుంటున్నారా ఐదు సంవత్సరాల క్రితం అజయ్ దేవగన్ మెయిన్ క్యారెక్టర్ లో రూపొందిన రైడ్ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయబోతున్నారట.
ఒక ఇన్కమ్ టాక్స్ అధికారి మరియు రాజకీయనాయకుడు చుట్టూ తిరిగే ఈ కథ పైన రవితేజ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ డైరెక్టర్ గా వ్యవహరించబోతున్నట్లు ఓ చిన్ని పుకారు షికారు చేస్తోంది. అయితే ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.
కానీ ఎన్నికలు దగ్గర పడడంతో ప్రచారాల్లో బిజీగా ఉన్న పవన్ కారణంగా చిత్రం కాస్త డిలే అవుతున్నట్లు సమాచారం. వార్తల ప్రకారం పవన్ సినిమా వాయిదా పడడం నిజమే అయితే హరీష్ శంకర్ రవితేజ తో మూవీకి రెడీ అయినట్లే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో నిప్పు మరియు నేనైతే లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వచ్చే ఈ మూడవ చిత్రం సక్సెస్ అయితే కచ్చితంగా ఈ కాంబో హ్యాట్రిక్ సాధించినట్లే.
ALSO READ : ఎన్టీఆర్ “దేవర” మూవీలో అల్లు అర్హ..! రెమ్యునరేషన్ ఎంతంటే..?
End of Article