Ads
సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల్లో ఏది ఫేక్, ఏది నిజం అనేది అర్దం కాదు మొన్నటికి మొన్న ఇండోనేషియా డాక్టర్, కరోనా పాజిటివ్ వచ్చింది చనిపోయే ముందు పిల్లల్ని చూసుకోవాలనుకున్నాడు అని ఒక ఫోటో వైరలయింది.అది చూసి ఎంతో మంది కన్నీరు కార్చారు.. కాని తర్వాత తెలిసింది ఏంటంటే అది ఫేక్ అని, అతడు బతికేఉన్నాడని.. కాని సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే ఒక ఫోటో పోస్టు చేసారంటే అందులో నిజం ఉండకపోదు కదా..
Video Advertisement
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక ఫోటో పోస్టు చేశారు. ఆ ఫోటోలోని వ్యక్తి భోపాల్ కి చెందిన సుదీర్ దేహారియా. అతడు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్. కరోనా విలయ తాండవం చేస్తున్న నేపధ్యంలో డాక్టర్లందరూ వారి వారి పనుల్లో నిమగ్నమైన సంగతి తెలిసిందే. సుధీర్ కూడా ఐదు రోజుల పాటు సుదీర్ఘంగా హాస్పిటల్లో సేవలందించి, ఒకసాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. కాని ఇంటికి చేరుకోగానే ఇంట్లోకి వెళ్లడానికి లేదు, భార్య పిల్లలని కలవడానికి లేదు.
దాంతో గేటు దగ్గరే కూర్చుని టీ తాగారు . సుధీర్ టీ తాగుతున్నంత భార్య,ఇద్దరు పిల్లలు గేటు దగ్గర చూస్తూ నిల్చుండిపోయారు. టీ తాగడం అయిపోయాక ఇంటి బయటనుండే మళ్లీ హాస్పిటల్ కి వెళ్లిపోయారు. ఇప్పుడు ఇదే ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.దీన్నే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా శేర్ చేశారు. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ ఫోటో చూస్తే డాక్టర్లు ఎంత కష్టపడుతున్నారో అర్దం అవుతోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
బార్డర్లో సైనికులు దేశం కోసం చేసే యుద్దాన్ని ఇప్పుడు డాక్టర్లు ప్రపంచం మొత్తాన్ని కాపాడడానికి చేస్తున్నారు. ఏ విధంగా అయితే సైనికులు కుటుంబాలకు దూరంగా ఉంటారో ఇప్పుడు వైధ్య సిబ్బంది పరిస్థితి అదే.. వారి యుద్దానికి సహకిరిస్తున్నారు పోలీసులు,పారిశుద్య సిబ్బంది.. కాబట్టి మన స్థాయిలో మనం చేయాల్సింది కేవలం ఇంటి నుండి అడుగు బయటపెట్టకుండా ఉండడం..మన బాద్యత మనం నిర్వర్తిద్దాం.
End of Article