కూతురంటే ఇలా ఉండాలి… ఈ కూతురు కథ వింటే ప్రతి తండ్రి గర్విస్తాడు.. ఇన్స్పైర్ చేసే రియల్ స్టోరీ..!

కూతురంటే ఇలా ఉండాలి… ఈ కూతురు కథ వింటే ప్రతి తండ్రి గర్విస్తాడు.. ఇన్స్పైర్ చేసే రియల్ స్టోరీ..!

by Megha Varna

Ads

నిజంగా తల్లిదండ్రుల్ని చూసుకోవడంలో ఉన్న ఆనందం మరెందులోనూ ఉండదు. తల్లిదండ్రుల్ని మనం చూసుకోవడం నిజంగా దేవుడు మనకు ఇచ్చిన గొప్ప వరం. కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కన్న తల్లిదండ్రుల్ని ఎలా వదిలించుకోవాలి అని చూసే వాళ్ళే ఎక్కువగా వున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ… అహర్నిశలు మనకోసం తపించి.. ఎల్లప్పుడూ మేలు కోరుకునే తల్లిదండ్రులని అనాధల్లా వదిలేయడం భావ్యమా..?

Video Advertisement

 

ఈ జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులని మనమే చూసుకోవాలని ఆదర్శంగా నిలిచింది చెన్నైకి చెందిన శరణ్య. ఇదేం సినిమా స్టోరీ కాదండి రీయల్ స్టోరీ. ఆమె జీవితాన్ని చూస్తే ఎవరైనా కంటతడి పెట్టుకుంటారు. చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు అనుభవించింది ఈమె. అయినప్పటికీ తన తల్లిదండ్రుల్ని అద్భుతంగా ఇప్పుడు చూసుకుంటోంది. పేదరికంతో చదువు ఆగదని.. పేదరికం మనం కష్టపడితే పోతుందని చాటి చెప్పింది ఈ యువతి. శరణ్య రెండేళ్ల వయస్సు లో వున్నప్పుడు ఆర్ధిక సమస్యల కారణంగా ఇల్లుని అమ్మేయాల్సి వచ్చింది. ఇలాంటివి ఎన్నో చూసిన శరణ్య ఏనాడూ కుమిలిపోలేదు. ఎవరి సహాయమో పొందాలని ఎదురు చూడలేదు. అప్పటి నుంచి కూడా ఎంతో కష్ట పడి చదువుకోవడం అలవాటు చేసుకుంది. ఈమె చాలా కష్టపడి ఒక ఎమ్మెల్సీ లో ఉద్యోగం పొందింది.

 

ఆ తరువాత జీవితాన్ని కూడా అందంగా మార్చుకుంది. రెండేళ్ల క్రితం తల్లిదండ్రుల్ని విమానం ఎక్కించి అంతర్జాతీయ ప్రదేశాలని కూడా తీసికెళ్ళింది. తల్లిదండ్రులకు ఇష్టమైన ప్రదేశాలన్నీ చూపించి వాళ్లు పడే ఆనందం లో ఆమె తన ఆనందాన్ని వెతుక్కుంది. నిజంగా తల్లిదండ్రులు అంటే భారం, బరువు అనుకునే వాళ్ళకి ఈమె ఉదాహరణగా నిలిచారు. తల్లిదండ్రుల్ని ఆనందంగా చూసుకుంటేనే మనం ఆనందంగా ఉంటామని రుజువు చేశారు. ఈ తరం ఆమెని ఆదర్శంగా తీసుకుని తల్లిదండ్రుల్ని చూసుకోవాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని చూసుకోవడం లో ఓ ఆనందం ఉంటుంది. వాళ్ళ ప్రేమ లో ఏదో తెలియని మాయ ఉంటుంది. ఒకసారి మీ బిజీ బిజీ పనులని పక్కన పెట్టి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి ఆ ప్రేమని పొందండి. అందులో వుండే మాధుర్యం తెలుస్తుంది. ఇలా ఇంత మంచి స్టోరీని హ్యుమన్స్ ఆఫ్ బాంబే వాళ్ళు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు.

 

 


End of Article

You may also like