Ads
ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి రెండవ భాగం కూడా ఉన్నట్టు సినిమా బృందం ప్రకటించింది. అయితే సినిమాకి కొంత మంది పాజిటివ్ టాక్ ఇస్తే, కొంత మందికి మాత్రం అంతగా నచ్చలేదు.
Video Advertisement
యాక్షన్ సినిమాల స్టైల్ ఇంతే. చాలా మందికి ఆ యాక్షన్స్ సినిమాలు నచ్చవు. కొంత మంది థియేటర్ కి వెళ్లి ఏదైనా సరదాగా ఒక సినిమా చూసి రావాలి అనుకుంటారు. మరి కొంత మంది మాత్రం యాక్షన్ సినిమాలు ఎంజాయ్ చేసినా కూడా అది కొంత వరకు మాత్రమే. కానీ సినిమా మొత్తం ఫైట్లతో నిండిపోయి ఉంటే మాత్రం సినిమా ఎంజాయ్ చేయడం కష్టమే.
సలార్ సినిమాలో ఎమోషన్స్ ఉన్నాయి. కానీ అవి కూడా కొంత వరకు మాత్రమే ప్రేక్షకుల వరకు వెళ్లాయి. సలార్ సినిమాకి రెండు ప్లస్ పాయింట్స్. ఒకటి ఎమోషన్స్. ఇంకొకటి యాక్షన్ సీన్స్. సినిమాకి మైనస్ పాయింట్స్ కూడా ఇవే. హీరో వాళ్ళ అమ్మ హీరో చేతిలో ఒక ప్లాస్టిక్ కత్తి పట్టుకుంటే భయపడి కత్తి పడేయమంటుంది. ఆ ఎమోషన్ ప్రేక్షకులకు అస్సలు కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అవ్వడం పక్కన పెడితే, అదేదో బోయపాటి సినిమాలో నటులు ఇచ్చినంత రియాక్షన్ ఆవిడ ఇచ్చారు అంటూ కామెంట్స్ చేశారు.
సాధారణంగా బోయపాటి సినిమాల్లో అందరూ కూడా అవసరానికి మించి ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. ఈ సినిమాలో కూడా అలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి అంటూ కామెంట్స్ వచ్చాయి. ఈ విషయం పక్కన పెడితే, ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ యాక్షన్ సీన్స్. ప్రభాస్ గత సినిమాల్లో ఇది చాలా ఎక్కువగా మిస్ అయ్యింది అనే ఒక ఫీలింగ్ చాలా మందికి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ భారీగా ఉన్నాయి.
సినిమాకి మైనస్ అయిన విషయం కూడా ఇదే. హీరో పెద్దగా కష్టపడకుండా తనకు ఎదురుకుండా వచ్చిన వాళ్ళందరిని నరుకుతూ వెళ్లిపోవడం అనేది ఒక పాయింట్ వరకు బాగానే ఉన్నా కూడా, మరొక పాయింట్ తర్వాత చిరాకు తెప్పించింది అనే కామెంట్స్ గట్టిగా వచ్చాయి. చేతికి ఎలివేషన్, నీడకి ఎలివేషన్, హీరో నడుస్తే ఎలివేషన్, హీరో నిల్చుంటే ఎలివేషన్, హీరో ఏది చేసినా ఎలివేషన్ అన్నట్టు చేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సినిమాలో హీరోకి నెగిటివ్ గా ఉన్నవాళ్లు కూడా హీరోని ఎలివేట్ చేస్తూనే చెప్తారు. హీరోకి పాజిటివ్ గా ఉన్న వాళ్ళు అయితే హీరోని ఆకాశానికి ఎత్తుతారు.
ప్రభాస్ గత సినిమాలు ఆశించిన ఫలితాన్ని పొందకపోవడం వల్ల, ఈ సినిమా వాటికంటే కాస్త బెటర్ గా ఉండడం వల్ల ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించారు. కానీ నెక్స్ట్ పార్ట్ లో మాత్రం ఇంతకంటే గొప్ప స్టోరీ ఉండాలని ఆశిస్తున్నారు కూడా. కాబట్టి ఇప్పుడు వచ్చిన రివ్యూలు, ఫీడ్ బ్యాక్ లు దృష్టిలో పెట్టుకొని, సినిమా బృందం నెక్స్ట్ పార్ట్ లో ఇవన్నీ కూడా మెరుగుపరుచుకుంటుంది ఏమో చూడాల్సిందే.
End of Article