Ads
లవ్ స్టోరీ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. కలెక్షన్ పరంగా కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగిన సంగతి తెలిసిందే. మొత్తానికి కరోనా లాక్ డౌన్ తరువాత.. ఓ సినిమా మంచి విజయాన్ని సాధించింది. సాయి పల్లవికి కూడా ఈ సినిమా బాగా పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో మెట్రో స్టేషన్ లో వచ్చే కిస్ సీన్ అందరిని ఆకట్టుకుంది.
Video Advertisement
కానీ, సాయి పల్లవి అభిమానులకి మాత్రం ఓ డౌట్ వచ్చింది. అసలు కిస్ సీన్ ఉంటే సాయి పల్లవి ఒప్పుకోదు. మరి ఈ సినిమాలో ఎలా చేసింది? అని అందరికి డౌట్ వచ్చేసింది. దీనిపై సాయి పల్లవి క్లారిటీ కూడా ఇచ్చేసింది. ఇటీవల ఈ విషయం గురించి మాట్లాడిన సాయి పల్లవి ఆ కిస్ సీన్ ఒరిజినల్ కాదని, కేవలం ఫేక్ సీన్ అని స్పష్టం చేసేసింది.
ఆ సీన్ కేవలం కెమెరాలు చేసిన జిమ్మిక్ అని వెల్లడించింది. కిస్ సీన్లు చేయడం తనకు ఇష్టం లేదని, దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా తనను ఇబ్బంది పెట్టరని, తన అభిప్రాయాలను గౌరవిస్తారని తెలిపింది. తనని ఇబ్బంది పెట్టకుండా తనకు రెండు వైపులా కెమెరాలను అమర్చి మాయ చేశారని చెప్పుకొచ్చింది. ఆ సీన్ బాగా వచ్చిందని, ప్రేక్షకులు కూడా ఆ సీన్ ను బాగా రిసీవ్ చేసుకున్నారని అసలు కారణం చెప్పుకొచ్చింది.
Watch Video:
End of Article