Ads
జబర్దస్త్ షో తో పాపులర్ అయిన వ్యక్తులు చాలామందే ఉన్నారు .అందులో సుడిగాలి సుధీర్ ముందు వరసలో ఉంటారు. రష్మీ ,సుడిగాలి సుధీర్ కలిసి చేసే ఫన్ కి చాలామంది అభిమానులు ఉన్నారు. జబర్దస్త్ కాకుండా ఇంకా చాలా షోస్ చేసి మెప్పించారు సుడిగాలి సుధీర్. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కు రాకముందు డబ్బులు సంపాదించడానికి మ్యాజిక్ లు చేసేవారు.మొదటగా మ్యాజిక్ ను తన మావయ్య దగ్గర నేర్చుకున్నారు సుధీర్.
Video Advertisement
కాగా 5 వ తరగతిలో తాను చేసిన మ్యాజిక్ కు మొదట సంపాదన వచ్చింది సుధీర్ కు. ఒక స్క్రిప్ట్ నిమిత్తం వేణు ద్వారా సుధీర్, కార్తీక్ రెడ్డి అనే దర్శకుడి దగ్గరకి వెళ్ళాడు ఆ నేపథ్యంలో సుధీర్ కు మొదటిసారిగా సినిమాలో నటించే అవకాశం వచ్చింది .ఆ చిత్రమే “అడ్డా “.ఈ చిత్రంతో సుధీర్ కు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది.రేస్ గుర్రం ,టైగర్ ,సుప్రీమ్ ,సర్ధార్ గబ్బర్ సింగ్ లాంటి పలు చిత్రాలలో నటించారు సుడిగాలి సుధీర్.
ప్రస్తుతం సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కమెడియన్ గా మాత్రమే కాకుండా, యాంకర్ గా, అలాగే యాక్టర్ గా కూడా దూసుకెళ్తున్నారు. అయితే మనం టీవీలో చూసే చాలా షోస్ లో సుధీర్ పై కొంచెం అందరూ సెటైర్లు వేస్తూ ఉంటారు. ప్రతి షోలో సుధీర్ పై ఎక్కువగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ కామెంట్స్ చూసే ప్రేక్షకులకే ఇబ్బందిగా అనిపిస్తాయి. “ఏంటి సుధీర్ పై ఇలా కామెంట్స్ చేస్తున్నారు?” అని అనిపిస్తుంది.
ముఖ్యంగా జబర్దస్త్, ఢీ లాంటి షోస్ లో సుధీర్ ని ఒక ప్లే బాయ్ లాగా చూపిస్తారు. ఇటీవల ఒక ఎపిసోడ్ లో సుధీర్ కి శ్రీమంతం చేసినట్లు చూపించారు. మామూలుగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత అన్ని పాత్రల్లోనూ నటించడం అంటే అందరూ అంత ప్రిఫర్ చేయరు. కానీ సుధీర్ మాత్రం పాత్రని కేవలం పాత్ర లాగానే కన్సిడర్ చేస్తారు.
ఎంతో కష్టపడి ఇంత మంచి స్థాయికి ఎదిగారు సుధీర్. అయినా కూడా కామెడీని కేవలం కామెడీ లాగా మాత్రమే చూస్తారు. నిజ జీవితం లో సుధీర్ కి ఎంత మంచి వ్యక్తో అందరికీ తెలుసు. ఆన్ స్క్రీన్ అయితే మాత్రం స్కిట్ ఏదైనా పాత్ర ఏదైనా ఎప్పుడూ తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు సుధీర్. అందుకే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
End of Article