ఈ జంట లవ్ స్టోరీ తెలుస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు…అంత స్పెషల్ ఎందుకంటే.?

ఈ జంట లవ్ స్టోరీ తెలుస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు…అంత స్పెషల్ ఎందుకంటే.?

by Megha Varna

Ads

ప్రేమ ఎంతో మధురంగా ఉంటుంది. ఇరువురు కూడా ఇష్టపడి అర్థం చేసుకుంటూ ఉంటే వాళ్ళ బంధం చక్కగా నడుస్తుంది. తాజాగా రెండు మూగమనసులుని ప్రేమ కలిపింది. ఇక వీళ్ళ ప్రేమ కథ గురించి చూస్తే.. సంజు కె.వాల్మీకి, అక్షత ఇద్దరూ కూడా టెన్త్ వరకు కలిసి చదువుకున్నారు.

Video Advertisement

ఇద్దరికీ కూడా మాటలు రావు. అలానే ఇద్దరికీ వినిపించదు కూడా. పదవ తరగతి తర్వాత వీళ్ళు ఎవరు చదువు కోసం వాళ్ళు వెళ్ళిపోయారు. బెంగళూరులో సంజు ఐటిఐ పూర్తి చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నాడు.

Also Read: “ఖిలాడి”తో రవితేజ మళ్లీ హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

వీళ్లిద్దరూ కూడా వాట్సాప్ లో టచ్ లో ఉండేవారు. వీళ్ళ మధ్య స్నేహం బాగా ఏర్పడింది. ఆ తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇరువురు కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్టు ఇంట్లో చెప్పేశారు. సంజు ఇంట్లో ఎలాంటి ఇబ్బంది రాలేదు. కానీ అక్షత వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. దీంతో వీళ్లిద్దరు జనవరి 29న దావణగెరె జిల్లా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నారు. అయితే అక్షత తండ్రి మాత్రం కోపంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంజు పై ఫిర్యాదు చేశారు.

కూతురిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు అని కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చే సంజుని స్టేషన్ కి తీసుకు వెళ్లారు. అయితే తర్వాత కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు అన్న దాంట్లో నిజం లేదని తెలిసింది. అక్షత జరిగింది మొత్తం చెప్పే సరికి పోలీసులు కూడా వీళ్ళు మేజర్లు అవడంతో ఒప్పుకున్నారు. అక్షత మా ఇంట్లో అడుగు పెట్టడం ఆనందంగా ఉందని సంజు తల్లిదండ్రులు అన్నారు. ఇబ్బందులు లేకుండా వీళ్ళు ఆనందంగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. వీళ్లిద్దరి మధ్య బంధం ఇలానే కొనసాగాలని మనం కూడా కోరుకుందాం.


End of Article

You may also like