Ads
మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. మొదట ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలోకి వచ్చి ఆ తర్వాత బాగా ఫేమస్ అయ్యిపోయి అద్భుతమైన ఫాలోయింగ్ ని పొందారు చిరంజీవి. ప్రస్తుతం ఆచార్య సినిమా తో బిజీ అయిపోయారు. చిరంజీవి ఆచార్య సినిమాపై ఫాన్స్ కి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ చిత్రం విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే వెంకీ కుడుములతో ఓ సినిమా చేసేందుకు చిరు ఒప్పుకున్నారట.
Video Advertisement
అయితే సినిమా అంటే ఎన్నో ఉంటాయి. ఫైట్స్, పాటలు మొదలు చాలా ఉంటాయి. ముఖ్యంగా సినిమాల్లో రియలిస్టిక్ సీన్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూంటారు. కొన్ని సినిమాల్లో హీరోలు చేయకుండా డూపులని పెట్టి సీన్స్ చేస్తూ వుంటారు. అలానే మెగాస్టార్ చిరంజీవికి కూడా 30 ఏళ్లగా ఒక వ్యక్తి డూపుగా నటిస్తున్నారు. తాజాగా ఆయన ఈటీవీ లో ఒక కార్యక్రమానికి వచ్చారు.
ఇక ఆ వ్యక్తి గురించి వివరాలులోకి వెళితే.. చిరంజీవికి 30 ఏళ్లుగా డూప్ గా వ్యవహరిస్తున్న అతను వెస్ట్ గోదావరి జిల్లా, పాలకొల్లుకి చెందినవారు. అతని పేరు ప్రేమ్ కుమార్. 30 ఏళ్లుగా తాను డూప్ కింద చిరంజీవికి నటిస్తున్నారని చెప్పారు. అయితే ఇలా మెగాస్టార్ కి డూప్ గా నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ప్రేమ్ కుమార్ తెలిపారు.
అలానే ఆయనకి ప్రేమ్ కుమార్ రికార్డింగ్ డ్యాన్స్ పేరు తో ఒక కంపెనీ కూడా వుంది అని చెప్పారు. అదే విధంగా రికార్డింగ్ డాన్సింగ్ చేసే వాళ్ళు మీద అందరికీ చిన్నచూపు ఉంటోంది అని.. రికార్డింగ్ డ్యాన్సర్స్కు సరైన ఆదరణ లభించడం లేదని చెప్పారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈటీవి ఆయన థాంక్స్ చెప్పారు ప్రేమ్ కుమార్.
End of Article