విపరీతంగా జుట్టు ఊడిపోతోందని.. 6 ఏళ్లుగా ఆ పని చేయడమే మానేసాడు.. చివరికి ఏమైందంటే..?

విపరీతంగా జుట్టు ఊడిపోతోందని.. 6 ఏళ్లుగా ఆ పని చేయడమే మానేసాడు.. చివరికి ఏమైందంటే..?

by Anudeep

Ads

ప్రస్తుతం చాలా మంది ఎదుర్కుంటున్న సమస్య అధికంగా జుట్టు రాలడం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎన్ని మంచి ఆయిల్స్ ని వాడినా జుట్టు రాలిపోతోంది అంటూ చాలా మంది తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా తలస్నానం చేస్తే చాలు.. ఈ జుట్టు మరింతగా రాలిపోతూ ఉంటుంది.

Video Advertisement

ఆడ, మగ తేడా లేకుండా.. అందరికి ఉన్న సమస్య జుట్టు రాలిపోవడం. శరీర భాగాల్లో అత్యంత సున్నితమైనది జుట్టు. ఐతే.. జుట్టుని ఆరోగ్యం గా, బలం గా ఉంచుకోవడం అంత తేలిక కాదు. తలస్నానం చేసినపుడు, సరిగ్గా ఆయిల్ పెట్టనప్పుడు ఊరికే జుట్టు రాలిపోతూ ఉంటుంది.

hair 1

ఇది నివారించడానికి రకరకాల చిట్కాలు పాటిస్తూ ఉంటాం. కానీ.. ఏవి మన జుట్టుకు సరిపడకపోతే జుట్టు రాలడం మరింత ఎక్కువ అవుతుంది. అయితే, నిక్ కోయెట్జీ అనే వ్యక్తి మాత్రం ఓ వింత ప్రయోగం చేసాడు. అంతే కాదు.. తాను చేసిన పనిని వీడియో తీసి నెట్టింట్లో పెట్టాడు. అయితే.. అతని ప్రయోగానికి వచ్చిన ఫలితాలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపడుతున్నారు.

white hair 1

అతనికి జుట్టు రాలే సమస్య చాలా ఇబ్బంది పెట్టేది. కాలేజీకి వెళ్తున్న రోజుల్లోనే వెంట్రుకలు అన్నీ ఊడి చొక్కా పై పడుతుండడంతో ఇబ్బంది పడేవాడు. చివరకు రెండు చొక్కాలను తీసుకెళ్లి ఒక సెక్షన్ అవ్వగానే మార్చుకుంటూ ఉండేవాడు. ఈ జుట్టు రాలడాన్ని ఎలా అయినా ఆపాలన్న ఉద్దేశ్యంతో ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి రోజు షాంపూ , కండిషనింగ్ చేయడం వల్లనే జుట్టు రాలుతోందని గ్రహించిన అతను అసలు తలస్నానం చేయడమే మానేసాడు.

wet hair

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరేళ్ళ పాటు తలస్నానం చేయడం మానేసాడు. అయితే.. ఫలితం మాత్రం అద్భుతంగా ఉందని చెబుతున్నాడు. నా జుట్టు ఇదివరకులా రాలడం లేదని, గతంలో కంటే స్ట్రాంగ్ గా ఉందని చెబుతున్నాడు. అయితే.. జుట్టుని వాష్ చేయకపోయినా.. శరీరంలోని రసాయనాలే నా జుట్టుని శుభ్రంగా ఉంచాయని చెప్పుకొచ్చాడు. దీనితో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అన్ని రోజులు తలస్నానం చేయకుండా ఎలా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 


End of Article

You may also like