Home Bigg Boss 6 telugu “బిగ్‌బాస్ తెలుగు” సీజన్-6 లో అడుగు పెట్టబోతున్న… ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?

“బిగ్‌బాస్ తెలుగు” సీజన్-6 లో అడుగు పెట్టబోతున్న… ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?

by Anudeep

బిగ్ బాస్ 6 త్వరలో ప్రేక్షకుల ముందుకు సందడి చేయడానికి రానుంది. తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇటీవలే బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా ముగిసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 6 ఎప్పుడు మొదలవుతుందా అని బిగ్ బాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించి కంటెస్టెంట్స్ వీరే అంటూ కొంతమంది పేర్లు వైరల్ అవుతున్నాయి.

ఈ తరుణంలో విశాల్ రాజ్, ప్రముఖ మోడల్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. అతను ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్న చాలా కంపెనీల యాడ్స్‌లో నటించాడు. ఇది ఇలా ఉంటే ఆరడుగుల ఎత్తు, మంచి బాడీ బిల్డర్ అయిన విశాల్ రాజ్‌ని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి పంపనున్నారు.

this model to enter bigg boss telugu season 6

అయితే ఇతని గురించి మనలో చాలా మందికి తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాడు తెలియదు కానీ ప్రస్తుతం ఈ కండల వీరుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నాడు అన్న సమాచారం మాత్రం బిగ్ బాస్ 6 మిగతా కంటెస్టెంట్స్ కి చమటలు పట్టిస్తుంది అని చెప్పొచ్చు. బిగ్ బాస్  షో అంటేనే ఎన్నో కసరత్తులు చాలెంజ్ కొట్టుకోవడం తిట్టుకోవడం ఇలా మనోరంజికమైనటువంటి చాలా విషయాలు ఉంటాయి. ఎప్పుడు వచ్చే కంటెస్టెంట్స్ అందరి మధ్యలో ఆజానుబాహుడిలా ఉండే విశాల్ తో తలపడడం మిగతా వారికి కష్టమవుతుందేమో అని కొంతమంది భావిస్తున్నారు.

this model to enter bigg boss telugu season 6

ఆల్రెడీ భీకరమైన ఫిజిక్ తో ఉండే విశాల్ తో ఫిజికల్ టాస్క్‌లు చేయాలంటే ప్రత్యర్ధి కంటెస్టెంట్‌కి చెమటలే. ఇతని ప్రెజెన్స్ వల్ల షో కి ఎలాంటి కిక్ వస్తుందో వేచి చూడాలి. ఇది ఇలా ఉండగా విశాల్ ఇంక 19 మంది సెలక్షన్ లిస్ట్‌ లోనే ఉన్నాడు కానీ ఇంకా బిగ్ బాస్ 6 లోకి అతని ఎంట్రీ కన్ఫర్మ్ కాలేదు. కాబట్టి ఇప్పుడు ఇతను బిగ్ బాస్ హౌస్ లోకి వస్తాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్…..షో స్టార్ట్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే…..

You may also like