Ads
భారత్ కు ఆసియా లోనే రెండవ అతిపెద్ద రైలు నెట్ వర్క్ ఉంది. దేశవ్యాప్తం గా ఎనిమిదివేల పైగా రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. దాదాపు చాలా రైల్వే స్టేషన్లకు వేటి ప్రత్యేకత వాటికే ఉంది. కానీ.. అలాంటి భారత్ లో ఓ అనామక రైల్వే స్టేషన్ కూడా ఉందన్న విషయం మీకు తెలుసా..?
Video Advertisement
అవును.. ఈ రైల్వే స్టేషన్ కు అసలు పేరు లేదు. ఈ పేరు లేని రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని ఆద్రా రైల్వే డివిజన్‌లో ఉంది. రైనా, రైనగర్ అనే రెండు గ్రామాల మధ్య వచ్చిన గొడవ కారణం గా ఈ రైల్వేస్టేషన్ కు ఇప్పటివరకు పేరు పెట్టలేదు. బంకురా-మసాగ్రామ్ రైలు మార్గం మధ్యలో వచ్చే ఈ రైల్వే స్టేషన్ రైనా, రైనగర్ అనే గ్రామాలకు మధ్యలో వస్తుంది. మొదట్లో “రైనగర్” అనే పేరు తో ఈ రైల్వేస్టేషన్ కు పేరు ఉండేది. అయితే.. మా గ్రామం పేరే పెట్టాలి అంటూ రెండు గ్రామాలూ గొడవపడటం తో పేరుని తొలగించారు. ఇప్పటివరకు ఆ గొడవ తేలకపోవడం తో ఈ రైల్వే స్టేషన్ కు అసలు పేరు లేదు. కానీ, టికెట్లు మాత్రం “రైనగర్” అన్న పేరుతోనే విక్రయిస్తున్నారు.
End of Article