రియల్ స్టోరీ: మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చనిపోయారు…అబార్షన్ చేయించుకోమన్నారు.కానీ?

రియల్ స్టోరీ: మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చనిపోయారు…అబార్షన్ చేయించుకోమన్నారు.కానీ?

by Megha Varna

Ads

జీవితంలో ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అప్పటివరకు ఉన్న ఆనందం ఒక్కసారిగా మాయమవుతుంది. అయినప్పటికీ కూడా మనం చక్కగా ఎప్పటిలాగే ఉండాలంటే ధైర్యంగా ముందుకు వెళ్లాలి. పాజిటివ్ అయినా నెగటివ్ అయినా ప్రతి సందర్భాన్ని కూడా మనం మనకి అనుకూలంగా మార్చుకోవాలి. అప్పుడే మనం జీవితంలో ముందుకు వెళ్లగలం.

Video Advertisement

నిజానికి ఈమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను చూస్తే ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేది తెలుస్తుంది. పైగా కష్టాలు వచ్చాయని ఆమె ఏ రోజు కుంగిపోలేదు. మరి ఇక ఆమె గురించి చూద్దాం.

source: instagram/thejaswi_nayak

ఈమెది కర్ణాటకలోని మంగళూరు. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా బాగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఉద్యోగాల్లో బిజీగా ఉండేవారు. అయినప్పటికీ ఆమెకి చదువులో ఎటువంటి సందేహాలు ఉన్నా వాళ్లు చెప్పేవారు. ఇలా వారి ప్రోత్సాహంతో స్కూలింగ్ ని పూర్తి చేసింది.

source: instagram/thejaswi_nayak

తర్వాత తండ్రి చనిపోవడంతో చాలా బాధలు పడ్డారు. అయితే తన తల్లే తండ్రై ఆమెని ముందుకు నడిపించింది. ఎంతో ధైర్యంగా ఉండాలని నేర్పించింది. ఆమె ప్రోత్సాహంతో ఈమె ఇంజనీరింగ్ పూర్తి చేసింది. బెంగుళూరు లో ఒక కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించింది. ఉద్యోగంలో చేరాక ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. పెళ్ళికి అంగీకరించడంతో ఇద్దరు మూడు ముళ్ళతో ఒకటయ్యారు. అయితే కన్న కలలు అన్నీ కూడా ఒక్కసారిగా కూలిపోయాయి.

source: instagram/thejaswi_nayak

పెళ్లయిన సంవత్సరానికి భర్త చనిపోయాడు. అప్పటికే ఆమె మూడు నెలల గర్భవతి. అత్త నీ వల్లే నా కొడుకు చనిపోయాడని.. నీ కడుపులో ఉన్న బిడ్డ శనిలా దాపురించాడు అని అన్నారు. డాక్టర్లు కూడా అబార్షన్ చేయించుకోమని.. చాలా లైఫ్ ఉందని చెప్పారు. అయినప్పటికీ ఆమె తన మనసుని అనుసరించారు. బిడ్డను కనాలని అనుకున్నాను అని ఆమె చెప్పారు. బిడ్డ పుట్టిన తర్వాత థెరపీ తీసుకుని బయటపడింది.

source: instagram/thejaswi_nayak

నిజానికి తన తల్లి ఈమెని ఎంతో బాగా చూసుకున్నారు. దానివల్లే ఈమె ఎంతో ధైర్యంగా ఉండగలిగారు. ఒక పక్క ఉద్యోగం చేస్తూ మరో పక్క పాపను చూసుకుంటున్నారు. సింగిల్ పేరెంట్స్ కి ఈమె స్ఫూర్తిని నింపేలా సోషల్ మీడియాలో చిట్కాలు ఇస్తున్నారు. అయితే జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలు వస్తాయని.. కృంగిపోకూడదు అని.. వాటి నుంచి బయట పడిపోతే మళ్ళీ మన జీవితం బాగుంటుంది అని ధైర్యంగా అడుగు వేయండి. ఆమె జీవితంలో ఈ విషయాన్ని నేర్చుకున్నాను అని.. ప్రతి ఒక్కరూ దీనిని తెలుసుకోవాలని ఆమె తన స్టోరీ ని షేర్ చేసుకున్నారు.


End of Article

You may also like