ఇందుకే కదా మన సినిమాలని ట్రోల్ చేసేది..? ఈ సీన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఇందుకే కదా మన సినిమాలని ట్రోల్ చేసేది..? ఈ సీన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

by kavitha

Ads

తెలుగు చిత్రాలలో రవిబాబు చిత్రాలు డిఫరెంట్ గా ఉంటాయి. ఇండస్ట్రీ అంతా ఒక జోనర్‌లో నడిస్తే, రవిబాబు మరో జోనర్‌లో సినిమాలను తెరకెక్కిస్తుంటారు. అలా రవిబాబు దర్శకత్వం వహించిన చిత్రాలలో హారర్‌ సినిమాలకు మంచి పేరు వచ్చింది. ‘అవును’ సిరీస్‌లో తెరకెక్కిన రెండు చిత్రాలకు పేరు వచ్చింది.

Video Advertisement

రవిబాబు నిర్మించిన క్రైమ్ థ్రిల్లర్ ‘అసలు’ అనే మూవీ నేరుగా ఓటీటీలో విడుదల అయ్యింది. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఇటీవల ఈటీవీ విన్ ఓటీటీలో విడుదల చేశారు. అయితే ఈ మూవీని చూసినవారు మాత్రం మన బ్రెయిన్ ఇలా కూడా పనిచేస్తుందా అని ఈ సినిమాని ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. Asalu-Movieపూర్ణ, ర‌విబాబు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన చిత్రం అస‌లు. ఈ చిత్రానికి సురేష్, ఉద‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక ఈ మూవీని డైరెక్ట్‌గా ఈటీవీ వారి విన్ ఓటీటీలో ఏప్రిల్ 14న విడుదల చేశారు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేపథ్యంలో రూపొందిన క్రైమ్ థ్రిల్ల‌ర్‌.  ర‌విబాబు ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తూనే ఈ మూవీని నిర్మించారు.కామెడీ, క్రైమ్ సస్పెన్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడంలో రవిబాబుకు మంచి పేరుంది. అనసూయ, అవును లాంటి చిత్రాలతో విజయం సాధించారు. చాలా గ్యాప్ తరువాత ‘అసలు’ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రంలోని ఒక సన్నివేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సీన్ లో డాక్టర్ ఒక పేషంట్ బ్రెయిన్ లో స్టోర్ అయిన ఇమేజ్ లు అంటూ హీరోయిన్ పూర్ణకు చూపిస్తుంది. ఆ పేషంట్ కాన్షియస్ గా చివరిసారి చూసిన విజువల్స్ అని చెప్తుంది. వాటి ద్వారా ఆమె షాక్ లోకి ఎందుకు వెళ్లిందో తెలుస్తుందని చెప్తుంది. పూర్ణ వాటిని చూసి ఆ ఫోటోలోని వ్యక్తిని గుర్తు పడుతుంది. ఇక ఈ సీన్ చూసినవారు బ్రెయిన్ ఇలా కూడా పనిచేస్తుందా అంటూ ఈ మూవీని ట్రోల్ చేస్తున్నారు.

watch video :

https://www.instagram.com/reel/CrXPJEuIMSZ/?igshid=NTc4MTIwNjQ2YQ==

Also Read: ఒకప్పటి ఈ 16 మంది “చైల్డ్ ఆర్టిస్ట్స్” ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? ఏం చేస్తున్నారంటే?

 


End of Article

You may also like