Ads
సాధారణంగా కళ్యాణ్ రామ్ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్న సినిమాలు చేసే హీరో అనే పేరు ఉంది. కొత్త దర్శకులని ప్రోత్సహించడంలో కళ్యాణ్ రామ్ ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు అలాగే మరొక కొత్త దర్శకుడితో కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Video Advertisement
అంతేకాకుండా మొదటిసారిగా కళ్యాణ్ రామ్ ఒక సోషియో ఫాంటసీ సినిమా చేశారు. ఇలాంటి పాత్రలో కళ్యాణ్ రామ్ నటించడం కూడా ఇదే మొదటి సారి. ఈ పాత్ర కోసం కళ్యాణ్ రామ్ చాలా కష్టపడ్డారు. బరువు తగ్గి, మేకోవర్ అయ్యి ఒక రాజు పాత్రకి ఎలా అయితే ఉండాలో అలాగే ఉన్నారు. తన కష్టమంతా సినిమాలో కనిపిస్తోంది.
నందమూరి నటవారసత్వం తో దూసుకుపోతున్న ముగ్గురు హీరోలకు ఒకే సెంటిమెంట్ బాగా అచ్చి వచ్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన బాలకృష్ణ “అఖండ” మూవీ మరియు జూనియర్ ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” మూవీ లో వాడిన పాప సెంటిమెంట్ భారీగా ప్రేక్షకుల ఆదరణ అందుకుంది. అఖండ సినిమా మొత్తం ఆ పాప మీద నడుస్తుంది. కథలో మలుపు తిరిగేది కూడా పాపకి సంబంధించిన విషయంతోనే. ఇంకా ఆర్ఆర్ఆర్ సినిమాలో అసలు కొమరం భీమ్ వచ్చేది మల్లి అనే పాపని వెతకడానికి. ఒక రకంగా ఈ సినిమా కూడా మొత్తం ఆ పాప మీద నడుస్తుంది.
ఎన్నో రోజుల నుంచి మంచి మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి వేచి ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్ ఇదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ “బింబిసార” చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా ఇంతకుముందు రిలీజ్ అయిన రెండు నందమూరి సినిమాలు పాప సెంటిమెంట్ తో భారీ హిట్లు సంపాదించిన నేపథ్యంలో అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్న ” బింబిసార” లో కూడా పాప కాన్సెప్ట్ సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఆగస్టు 5న రిలీజ్ అయిన ఈ సినిమాలో కేథరిన్ ట్రెసా హీరోయిన్ గా నటించగా, వెన్నెల కిషోర్ , బ్రహ్మాజీ, సంయుక్త మీనన్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.
End of Article