“థాంక్యూ” లో ఆ స్టార్ యాక్టర్ కూడా ఉన్నారా..? ఆ సీన్స్ ఎందుకు డిలీట్ చేశారు..?

“థాంక్యూ” లో ఆ స్టార్ యాక్టర్ కూడా ఉన్నారా..? ఆ సీన్స్ ఎందుకు డిలీట్ చేశారు..?

by Anudeep

Ads

నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన థాంక్యూ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. గత కొన్నాళ్లుగా కురుస్తున్న వర్షాలు సైతం థాంక్యూ సినిమాకు మైనస్ అయ్యాయి.

Video Advertisement

అయితే థాంక్యూ సినిమాలో స్టార్ కమెడియన్ సునీల్ సీన్లను డిలీట్ చేశారనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సినిమా నిడివి ఎక్కువ కావడంతో సునీల్ కు సంబంధించి కీలక సన్నివేశాలు సినిమా నుంచి డిలీట్ చేశారంట! ఈ సినిమా ఒరిజినల్ రన్ టైమ్ 165 నిమిషాలు అని, దాని నుంచి 36 నిమిషాల సీన్లు కట్ చేశారని తెలుస్తోంది.

డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ స్పందించి వైరల్ అవుతున్న ఈ వార్తల గురించి క్లారిటీ ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. థాంక్యూ సినిమాను ఎక్కువ నిడివితోనే రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని సినిమాను హడావిడిగా ముగించారనే భావన కలుగుతోందని ప్రచారం జరుగుతోంది. నాగచైతన్య ప్రస్తుతం కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నటుడిగా మాత్రం థాంక్యూ చైతూకు మంచి పేరును తెచ్చిపెట్టింది.

థాంక్యూ సినిమాతో రాశి ఖన్నా ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందనే సంగతి తెలిసిందే. నిజానికి డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ తనదైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను మెస్మరస్ చేయగలడు కానీ థాంక్యూ లో అది కనిపించలేదు. బహుశా మొదటిసారి ఇంకొకరి కథకు డైరెక్షన్ చేయడం దీనికి కారణం కావొచ్చు. అలాగే చైతూ అమీర్ ఖాన్ తో కలసి నటించిన బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దా వచ్చే నెలలో విడుదలకు సిద్దంగా ఉంది.


End of Article

You may also like