Home Filmy Adda హీరోగా అడుగు పెట్టబోతున్న… ఈ “స్టార్” నటుడి కొడుకు ఎవరో తెలుసా..?

హీరోగా అడుగు పెట్టబోతున్న… ఈ “స్టార్” నటుడి కొడుకు ఎవరో తెలుసా..?

by Anudeep

సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది చాలా కామన్. చిత్ర పరిశ్రమలో ఉండే చాలా మంది నటీనటులు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు. అలా వచ్చి.. సక్సెస్ అయిన వారు చాలా మందే ఉన్నారు.

తాజాగా బుల్లితెర నటుడు, ఈటీవీ ప్రభాకర్ తనయుడు.. హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ‘ఇంట్రడ్యూసింగ్ చంద్రహాస్’ పేరుతో మీడియాతో ముఖాముఖి నిర్వహించారు.

tv prabhakar introducinng his son as hero
తనయుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్న సందర్భంగా ‘ఈటీవీ’ ప్రభాకర్ మాట్లాడుతూ ”నేను ఇండ్రస్టీకి వచ్చి పాతికేళ్ళు. ఇప్పుడు మా అబ్బాయి కూడా ఇండస్ట్రీని నమ్ముకున్నాడు. నటనను వృత్తిగా ఎంచుకుని హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హీరో కావాలనేది కేవలం చంద్రహాస్‌ కోరిక మాత్రమే. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. తండ్రిగా వాడి ఇష్టాన్ని ప్రోత్సహించడం నా ధర్మం కనుక చేస్తున్నాను. హీరో అవుతానంటే ముందు చదువు పూర్తి చేయమని చెప్పాను.

tv prabhakar introducinng his son as hero

 

అయినా సరే… పట్టు వదలని విక్రమార్కుడిలా ఓ వైపు చదువుతూ… మరోవైపు ఫైట్స్‌, డాన్స్‌, యాక్టింగ్‌ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నారు. ఒకరోజు కవర్ సాంగ్ చేయడానికి డబ్బులు ఇవ్వమంటే ఇచ్చాను. ‘నాటు నాటు’ సాంగ్ చేశాడు. అది చూసి దర్శక నిర్మాతలు సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు” అని చెప్పారు.

tv prabhakar introducinng his son as hero
కిరణ్‌ బోయినపల్లి, కిరణ్‌ జక్కంశెట్టి నిర్మాణంలో హీరోగా చంద్రహాస్ ఒక సినిమా చేస్తున్నాడు. దాన్ని నూతన దర్శకుడు కృష్ణ డైరెక్ట్ చేయనున్నారు. ఏవీఆర్‌ మూవీ వండర్స్‌ పతాకంపై ఏవీఆర్‌, నరేష్‌ నిర్మాణంలో సంపత్‌ వి. రుద్ర దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు చంద్రహాస్. ‘ఈటీవీ’ ప్రభాకర్ సొంత నిర్మాణ సంస్థ శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్‌ పతాకంపై ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ చిత్రానికి కళ్యాణ్‌, వెంకట్‌, కాముని శివ, ప్రేమ్‌ సాగర్‌, తోట సురేష్‌ సహ నిర్మాతలు.

tv prabhakar introducinng his son as hero

‘ఊహ తెలిసినప్పటి నుంచి టీవీ సీరియల్స్‌, టెలీ ఫిలిమ్స్‌, సినిమా ప్రముఖులు…ఇలా షూటింగ్‌ల వాతావరణంలో పెరిగాను. నాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. హీరో అవ్వాలనేది నా డ్రీమ్‌. మా నాన్నగారి కెరీర్‌లో ఎత్తుపల్లాలు చూశా. అయినా ఆయన మంచి ప్రవర్తనతో అందరూ ఇష్టపడే స్థాయికి వచ్చారు. నేను నాన్నగారిలా అందరినీ గౌరవిస్తూ ముందుకు సాగాలని మా అమ్మగారి కోరిక. నా నుంచి ఎలాంటి లోపం లేకుండా కృషి చేస్తాను. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌లే నాకు ఇన్స్పిరేషన్ ” అని చంద్రహాస్ తెలిపారు.

You may also like