Bigg Boss Telugu Season-6 : బిగ్ బాస్ సీజన్ 6 లో రాబోతున్న… ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Bigg Boss Telugu Season-6 : బిగ్ బాస్ సీజన్ 6 లో రాబోతున్న… ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

by Anudeep

Ads

తెలుగునాట బిగ్ బాస్ రియాలిటీ  షో కి మంచి ఆదరణ ఉంది. ఐదవ సీజన్ ఓటీటీ లో స్టార్ట్ చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. కంటెస్టెంట్స్ అందరూ ఎంతో ఎంటర్టైనింగ్ గా షోని ముందుకు సాగించారు.  బిగ్ బాస్ ఓటీటీ తొలి సీజన్ లో బిందుమాధవి ఫైనల్ కూడా గెలిచి టైటిల్ ని సంపాదించుకుంది.

Video Advertisement

ఇప్పటి వరకు ఐదు సీజన్లు పూర్తి అయిన తర్వాత  బిగ్ బాస్ రియాల్టీ షో 6వ సీజన్ కు సిద్ధమైపోతుంది. ఈ ఆరవ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా ఉండబోతున్నారు.

ఈ సీజన్  వచ్చే సెప్టెంబర్ లో ప్రారంభం కానుంది అనే  గుసగుసలు వినిపిస్తున్నాయి . కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ క్రమంలో 6వ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరే అంటూ  కొన్ని పేర్లు  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఒకరు వడ్డే నవీన్. కోరుకున్న ప్రియుడు చిత్రం తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకప్పుడు సక్సెస్ ఫుల్ హీరోగా సినిమాలు చేసి టాలీవుడ్ లో మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. అప్పట్లో ఎంతో  క్రేజ్ వున్న నవీన్ గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలలో కనిపించడంలేదు. అంతే కాకుండా ఎటువంటి సినిమా ఈవెంట్ లో కూడా ఎక్కడా కనిపించలేదు.

vadde naveen 2

ఒకప్పుడు స్టార్ హోదా ఉన్న వడ్డే నవీన్ ని బిగ్ బాస్  హౌస్ తీసుకొచ్చేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నవీన్ బిగ్ బాస్ హౌస్ కి రప్పించేందుకు భారీగా రెమ్యూనరేషన్ కూడా ఇవ్వడానికి వెనకాడటం లేదని నిర్వాహకులు. ఎంతోకాలంగా కనిపించకుండా ఉన్న వడ్డే నవీన్ బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తారా.. లేదా.. అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సీజన్ 6 లోకి ఎంట్రీ అయితే మాత్రం హౌస్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా వడ్డే నవీన్ నిలుస్తారు.


End of Article

You may also like