Ads
ఈ సంవత్సరం ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కొరటాల శివ. ఈ సినిమా అనుకున్న ఫలితం సాధించలేదు. దాంతో కొరటాల శివ కొంత సమయం తీసుకొని లేట్ అయిన పర్వాలేదు మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వద్దాం అని అనుకుంటున్నారు. అందుకే ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
Video Advertisement
ఇప్పటికే ఈ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన ఒక డైలాగ్ విడుదల అయ్యింది. సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ అని ముందే చెప్పారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కూడా చాలా కష్టపడుతున్నారు. బరువు తగ్గడంతో పాటు సినిమాకి సంబంధించి చాలా విషయాలపై శ్రద్ధ వహిస్తున్నారు అని తెలుస్తోంది.
అయితే ఇన్ని జరుగుతున్నా కూడా ఈ సినిమాలో హీరోయిన్ విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ముందు ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు అని అన్నారు. కానీ తర్వాత జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా చెయ్యట్లేదు అని అన్నారు. అసలు అందరి కంటే ముందు ఆలియా భట్ పేరు వచ్చింది. ఆలియా భట్ ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. దాంతో సినిమాలు ఏమి చేయట్లేదు. ఆ తర్వాత జాన్వీ కపూర్ పేరు వచ్చింది.
ఆ తర్వాత మృణాల్ ఠాకూర్ అని కూడా అన్నారు. అంతే కాకుండా అనన్య పాండే కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు అని అన్నారు. కానీ అవన్నీ కేవలం వార్తలు మాత్రమే. ఇప్పుడు ఇలాంటి వార్త ఒకటి మళ్లీ బయటికి వచ్చింది. అదేంటంటే మరొక టాప్ హీరోయిన్ ఈ సినిమా తిరస్కరించారు అనే వార్త వస్తోంది. గత కొద్ది సంవత్సరాల నుండి వరుస తెలుగు సినిమాలతో ఎంతో పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఈ సినిమా తిరస్కరించారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు నానితో దసరా సినిమాలో నటిస్తున్నారు. అంతే కాకుండా మరికొన్ని సినిమాల్లో కూడా కీర్తి సురేష్ నటిస్తున్నారు. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం మాత్రం తెలీదు. ప్రస్తుతం అయితే సినిమా బృందం షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. సినిమా హీరోయిన్ పై ఇంకా కొంత కాలంలో క్లారిటీ వస్తుంది.
End of Article