Ads
తల్లిదండ్రులు చదువుకోండి నాయనా అంటుంటే చదువుకోని పిల్లలు ఉన్న ఈరోజుల్లో.. ఎన్నో కష్టాలని భరించి చదువే అన్నీ అనుకుని ముందుకు వెళ్లే వాళ్ళు కూడా వున్నారు. ప్రియాంకకి చదువంటే ఇష్టం. కానీ ఈమెని బడి నుంచి గెంటేశారు. అయినప్పటికీ కూడా ఈమెకి చదువు మీద ఉన్న ఆసక్తి అమెరికా దాకా తీసుకు వెళ్ళింది. అయితే మరి ఆమె జీవితం గురించి తప్పక చూడాల్సిందే. ప్రియాంక జీవితంలో ఎంతో కష్టపడింది. ఆమె చిన్నతనంలోనే వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు.
Video Advertisement
తన తండ్రి కూలీ. తల్లి ఏసీపీ కార్యాలయంలో స్వీపర్. వీళ్ళకి మొత్తం ముగ్గురు పిల్లలు. అయితే తమ పిల్లలు మాత్రం వాళ్ళల్లా కాకూడదని ప్రైవేట్ స్కూల్లో వేశారు. కానీ ఫీజులు కట్టలేకపోవడంతో ఆమె నాలుగో తరగతిలో ఉన్నప్పుడు స్కూలు నుండి గెంటేశారు. ఆ తర్వాత ఆమె చాలా బాధపడింది. జీవితంలో ఇలాంటి బాధ ఎప్పుడు రాకూడదని.. ఇకపై చదువు భారం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అంతా కలిసి ఆలోచించారు.
ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటే ఫ్రీగా చదువుకోవచ్చు. అలానే వసతి కూడా ఉచితమని తెలిసింది. ప్రియాంక పరీక్ష రాసింది. ఆ పరీక్షలో పాస్ అయింది. దీంతో బోరబండలోని రెసిడెన్షియల్ స్కూల్లో 90 శాతం మార్కులతో పాస్ అయింది. ఆ తర్వాత గౌలిదొడ్డి ప్రభుత్వ కాలేజీ గురించి ఆమె తెలుసుకుని అక్కడ చేరింది. అక్కడ సీటు రావడం కూడా చాలా కష్టం. స్క్రీనింగ్ తో పాటు మరో వ్రాత పరీక్ష కూడా పాస్ అవ్వాలి. అయితే ఈమె అందులో కూడా పాస్ అయ్యి సీటు తెచ్చుకుంది. ఇంటర్ ఎంఈసి లో 97 శాతం మార్కులు ఆమెకి వచ్చాయి. తెలంగాణలో టాప్ టెన్ కూడా ఈమె.
ఆ తర్వాత బుద్వేల్ లో సోషల్ వెల్ఫేర్ కాలేజీలో డిగ్రీ చదివే అవకాశం వచ్చింది. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి అయ్యాక కమ్యూనిటీ కాలేజీ ఇనిషియేటివ్ ప్రోగ్రాంలో భాగంగా అమెరికా వెళ్లి చదువుకునే అవకాశం వచ్చింది. అయితే ఈ అవకాశం ఎలా వచ్చిందంటే హైదరాబాద్లోనే యూఎస్ కాన్సులేట్ వాళ్లు ప్రతి ఏటా కూడా పెడతారు. దానిలో ఎంపికైన వాళ్ళని కమ్యూనిటీ కాలేజీలో చదువుకోడానికి అమెరికా పంపిస్తారు. అందులో కూడా ఈమె పాస్ అయింది. అయితే ఇక్కడికి వెళ్లాలంటే ఏడాది పాటు ఆమె చదువుకు దూరం అవ్వాలి. నాలుగో సెమిస్టర్ సమయానికి తిరిగి వచ్చి అన్ని పరీక్షలు ఒకేసారి రాయాలని నిర్ణయించుకుంది.
ఇక యూఎస్ లో ఏం చెప్తారు అనేది చూస్తే… అక్కడ విద్యార్థులు ఐటి తరగతులకు హాజరు అవ్వాలి. 70 గంటలు ఇంటర్న్షిప్ చేయాలి. అదేవిధంగా వంద గంటలు వాలెంటరీ సేవలు ఇవ్వాలి. అక్కడ వాళ్ల గురించి తెలుసుకోవడం మన సంప్రదాయాలని వాళ్ళకి తెలపడం వంటివి చేయాలి. అయితే ఈ ఖర్చులు అన్నీ కూడా అమెరికా ప్రభుత్వమే భరిస్తుంది. నిజంగా ఈమె ఆ స్టేజ్ నుండి ఈ స్టేజ్ కి రావడం గొప్ప విషయం. ఇలాంటి విద్యార్థులను ఆదర్శంగా తీసుకుంటే ఏ విద్యార్థి అయినా సక్సెస్ అవ్వగలరు.
End of Article