Ads
ఇటీవలి కాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ లు వచ్చాక.. ఎక్కడో దూరాన ఉన్న వ్యక్తులతో సౌలభ్యంగా మాట్లాడుకునే అవకాశాలు ఏర్పడ్డాక ఇలాంటి ఘోరాలకు మరింత తావు వచ్చినట్లు అవుతోంది. అరేంజ్డ్ మ్యారేజెస్ లోనే అనుకుంటే.. ప్రేమ వివాహాల్లో కూడా ఇటువంటి దుర్ఘటనలు తప్పడం లేదు.
Video Advertisement
ఆ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమలోని మాధుర్యాన్ని పూర్తిగా చవి చూడకుండానే మూడవ వ్యక్తి ప్రవేశంతో వారి కాపురం విచ్ఛిన్నమైంది. భార్య పరాయి వ్యక్తి ప్రేమకి అర్రులు చాచడంతో.. చివరకు కటకటాల పాలైంది. భాస్కర్ గౌడ్, హరిత లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు ఏడాది క్రితమే నగరానికి చేరుకున్నారు. భాస్కర్ ఇసుక వ్యాపారం చేస్తుంటాడు. మధురానగర్ కు చెందిన వెంకటేష్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
ఈ క్రమంలో హరితకు వెంకటేష్ కు పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది. అయితే ఈ విషయం రెండు కుటుంబాలకు తెలిసిపోయింది. దీనితో భాస్కర్ ఇల్లు ఖాళీ చేసి చింతలకుంట వైపుకు మారిపోయారు. అయితే అక్కడ కూడా వీరి మధ్య సంబంధం కొనసాగుతూ వచ్చింది. భాస్కర్ ఇంట్లో లేని సమయం చూసి వెంకటేష్ హరిత వద్దకు వస్తుండేవాడు. భాస్కర్ ఎప్పుడు ఎటు వెళ్తున్నాడో తెలుసుకోవడానికి అతని కార్ కు జిపిఎస్ పరికరాన్ని అమర్చాడు.
మరోవైపు భాస్కర్ ను అడ్డు తొలగించుకోవాలని కూడా వెంకటేష్ యోచిస్తున్నాడు. ఇందుకోసం ఓ గ్యాంగ్ ను సంప్రదించి వారికి ఐదు లక్షలను ముట్ట చెప్పారు. ఆ గ్యాంగ్ అదను కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 16 న హరిత భర్తకి మజ్జిగలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. ప్రియుడితో కలిసి వెళ్ళిపోతున్నానని అతని సెల్ కి మెసేజ్ కూడా పెట్టింది. అయితే ఈ విషయమై పోలీసులు ఆరా తీయగా ఈ హత్యా పధకం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నవీన్ ను పోలీసులు ఇప్పటికే పట్టుకున్నారు. కాగా, మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
End of Article