ప్రేమించిన వాడి కోసం ఏ పాపం తెలియని తల్లీకూతుళ్ళకి అన్యాయం చేసింది… ఇలాంటి అమ్మాయిని ఎక్కడా చూసుండరు!

ప్రేమించిన వాడి కోసం ఏ పాపం తెలియని తల్లీకూతుళ్ళకి అన్యాయం చేసింది… ఇలాంటి అమ్మాయిని ఎక్కడా చూసుండరు!

by Anudeep

Ads

ప్రేమ రుధిరమైనది అని అంటుంటారు. ఎందుకంటే అది ఒక్కొక్కసారి చెయ్యకూడని పనులను కూడా చేయిస్తుంది. వివాహబంధం అన్నది లేకపోతే.. కొన్ని సార్లు ప్రేమ సంబంధాలు ఎక్కడివరకు తీసుకెళ్తాయో కూడా చెప్పలేం. ఒక్కోసారి పరిమితికి మించిన ప్రేమ క్రోధంగా మారి దారుణాలను చేయిస్తుంది.

Video Advertisement

ఇటువంటి ఘటనే కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. తాను ప్రేమించిన వాడి కోసం ఓ అమ్మాయి ఏకంగా ఆ అబ్బాయి భార్యని, అత్తని చంపేసింది. వివరాల్లోకి వెళితే, కొమరగిరిపట్నం గ్రామానికి చెందిన మేడిశెట్టి సురేష్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన నాగలక్ష్మిని ప్రేమించాడు.

nagalakshmi

అయితే.. అప్పటికే నాగలక్ష్మికి పెళ్లి అయింది. నాగలక్ష్మితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఆ తరువాత కొంతకాలంగా దూరంగా ఉంటూ వచ్చాడు. ఇటీవల అదే గ్రామానికి చెందిన జ్యోతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో నాగలక్ష్మిని పట్టించుకోవడం మానేసాడు. దీనితో ఆగ్రహించిన నాగలక్ష్మి సురేష్ ను తన భార్యని వేరు చేయాలనీ ప్రయత్నించింది. జ్యోతికి అక్రమసంబంధం ఉందంటూ ఆకాశరామన్న ఉత్తరాలు రాసేది.

lover 2

ఇవేమీ పట్టించుకోకుండా సురేష్ భార్యని ప్రేమగా చూసుకునేవాడు. దీనితో జ్యోతిని చంపేస్తే సురేష్ తన దగ్గరకి వస్తాడని నాగలక్ష్మి భావించింది. ఈ క్రమంలోనే జ్యోతి తన తల్లి వద్దకు వెళ్ళింది. ఇదే అదనుగా భావించిన నాగలక్ష్మి తన సవితి కూతుళ్లయిన సౌజన్య, దివ్య, హరితల సాయంతో ఆమెను హత్య చేయాలని భావించింది. వారు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తన కూతుళ్లను పంపి వారిపై పెట్రోల్ పోయించింది.

వారు బయటకు రాగానే ఇంటికి నిప్పంటించింది. అగ్ని ప్రమాదం జరిగిందని భావించిన చుట్టూ పక్కల వారు ఇంట్లోని వారిని కాపాడాలనుకున్నారు. కానీ, అప్పటికే తల్లీ కూతుళ్లు ఇద్దరు సజీవదహనమయ్యారు. ఇది మొదట ప్రమాదమనే అందరూ అనుకున్నారు. కానీ, పోలీసులు హత్యా కోణంలో ఆలోచించి చూడగా నాగలక్ష్మి చేసిన నిర్వాకం బయటపడింది. ప్రస్తుతం నాగలక్ష్మిని, ఆమె సవతి కూతుళ్ళని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పెళ్లికి ముందు భర్త నడిపిన అక్రమ సంబంధం అన్యాయంగా ఆ తల్లి కూతుళ్ళని పొట్టనబెట్టుకుంది.


End of Article

You may also like