ఈ లేడీ TC చేసిన పని చూస్తే హాట్సాఫ్ అనాల్సిందే..! రైల్వే చరిత్రలో మొట్టమొదటిసారిగా..?

ఈ లేడీ TC చేసిన పని చూస్తే హాట్సాఫ్ అనాల్సిందే..! రైల్వే చరిత్రలో మొట్టమొదటిసారిగా..?

by Anudeep

Ads

రైలులో టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం. ఇందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ప్రయాణికులు టికెట్ ఇన్‌స్పెక్టర్ల కళ్లుగప్పి ప్రయాణం చేస్తుంటారు. అంతే కాకుండా కొందరు ప్రయానికి రైల్వే అధికారులతో దురుసుగా ప్రవర్తిస్తారు కూడా.. అయితే ఎన్నో సవాళ్ల తో కూడుకున్న ఈ ఉద్యోగం లో తాజాగా ఒక మహిళా టీసీ రికార్డు సృష్టించింది.

Video Advertisement

టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని, చెల్లని టికెట్‌తో ప్రయాణిస్తున్న వారిని టీసీ రోసాలిన్ అరోకియా మేరీ ఖచ్చితం గా పట్టుకుంటారు. ఇలా పట్టుబడిన వారి నుంచి పెనాల్టీల రూపంలో ఈ ఏడాది ఏకంగా కోటి రూపాయలను వసూలు చేశారామె. సదరన్ రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ గా మేరీ విధులు నిర్వర్తిస్తున్నారు. పూర్తి నిబద్ధతతో పనిచేస్తూ ప్రయాణికుల రైల్వే టికెట్లను చెక్ చేస్తుంటారు. స్టేషనులో, రైలులో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తుంటారు. టికెట్ లేని, చెల్లని టికెట్‌లతో ప్రయాణించే వారిని గుర్తించి జరిమానా విధిస్తుంటారు.

this women TC sets record in fines collection.!!

ఇలా 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు పెనాల్టీల రూపంలో రూ.1.03 కోట్లను మేరీ వసూలు చేశారు. దేశంలో ఇలా పెనాల్టీలను వసూలు చేసిన తొలి మహిళా టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా రోసాలిన్ మేరీ ఘనత సాధించారు. మేరీ పనితనాన్ని ప్రశంసిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఆమె సేవలను కొనియాడింది. ‘భారతీయ రైల్వే చరిత్రలో నాన్ టికెటెడ్ ట్రావెలర్స్ నుంచి పెనాల్టీగా రూ.1.03 కోట్లను వసూలు చేసిన తొలి మహిళా అధికారిగా రోసాలిన్ నిలిచింది’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌లో మేరీ ఫొటోలను యాడ్ చేసింది. రైల్వే స్టేషనులో, రైలులో ప్రయాణికుల టికెట్లను తనిఖీలు చేస్తూ, టికెట్ లేని ప్రయాణికుల నుంచి పెనాల్టీ వసూలు చేస్తున్న దృశ్యాలను మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ఖాతా లో పంచుకుంది.

this women TC sets record in fines collection.!!

వృత్తిపై అరోకియా మేరీ చూపిస్తున్న డెడికేషన్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇటువంటి ఉద్యోగులు భారత్ కి అవసరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరో వైపు 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు పెనాల్టీల రూపంలో కోటి రూపాయలకు పైగా వసూలు చేసిన అధికారుల జాబితాను సదరన్ రైల్వే విడుదల చేసింది. మేరీతో పాటు మరో ఇద్దరు అధికారులు ఈ ఘనత సాధించారు. చెన్నై డివిజన్‌లో డిప్యూటీ చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్. నందకుమార్ రూ.1.55 కోట్లు కలెక్ట్ చేశారు. సీనియర్ టికెట్ ఎగ్జామినర్‌గా విధులు నిర్వహిస్తున్న శక్తివేల్ రూ.1.10 కోట్లను పెనాల్టీ కింద వసూలు చేశారు. దీంతో వీరందరిని రైల్వే శాఖ అభినందించింది.


End of Article

You may also like