ఏడాది ప్రారంభంలోనే అదిరిపోయే హిట్స్ కొట్టిన ఇండస్ట్రీస్..

ఏడాది ప్రారంభంలోనే అదిరిపోయే హిట్స్ కొట్టిన ఇండస్ట్రీస్..

by Anudeep

Ads

కొత్త ఏడాది 2023 తొలివారం బాక్సాఫీసు నిశ్శబ్దంగా కనిపించింది. 2023 లో తొలి విజయం అందుకొనే అవకాశం సంక్రాంతి సినిమాలకి దక్కింది. ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురిపించాయి. విడుదలైన అన్ని చిత్రాలు సూపర్ హిట్స్ కావడం తో అందరి హీరోల అభిమానులు, బయ్యర్స్ సంతోషంగా ఉన్నారు. ఈ ఏడాది ముందుగా నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ సినిమా వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి సెన్సేషనల్ ఓపెనింగ్స్ దక్కాయి.

Video Advertisement

 

 

ఈ చిత్రం తర్వాతి రోజే మెగా స్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం లో చిరు వింటేజ్ లుక్, మేనరిజమ్స్, కామెడీ వర్కవుట్ అయ్యాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరుకు సరైన హిట్ దక్కలేదు. దీంతో ఈ చిత్రం పై ఫాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకి ఇప్పటి వరకు 135 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు సంపాదించింది. చిరు సెకండ్ ఇన్నింగ్స్ కి బూస్ట్ ని ఇచ్చింది ఈ చిత్రం.

this year all industries got good profits..

గత కొన్నేళ్లుగా షారుఖ్ ఖాన్ ట్రాక్ రికార్డు ఏమంత బాగాలేదు. ఒకపుడు కింగ్‌ ఖాన్‌గా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను తన కనుసైగలతో శాసించిన ఈయన ఇపుడు హీరోగా ఉనికి కోసం పోరాడుతున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ప్లాప్ లుగా నిలిచాయి. ఆయనకి సాలిడ్ కం బ్యాక్ ఇచ్చింది ఈ పఠాన్ మూవీ. కేవలం షారుఖ్ కే కాదు మొత్తం బాలీవుడ్ కి కూడా ఈ చిత్రం ఊపిరిపోసింది. గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోంది బాలీవుడ్. పఠాన్ చిత్రం హిట్ కావడం తో బాలీవుడ్ కి ఆశలు చిగురించాయి. కేవలం ఆరు రోజుల్లోనే 600 కోట్ల రూపాయలకు దగ్గరగా వచ్చిన ఈ సినిమా ఫుల్ రన్ లో వెయ్యి కోట్ల రూపాయిలు అందుకుంటుందని అంచనా.

this year all industries got good profits..

ఇదేవిధంగా తమిళ్ ఇండస్ట్రీ లో కూడా సూపర్ స్టార్లు అజిత్, విజయ్ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అజిత్ ‘తునీవు’ చిత్రం 182 కోట్ల రూపాయిల గ్రాస్ , మరియు విజయ్ ‘వారిసు’ సినిమా 290 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సూపర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో వారి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి సూపర్ స్టార్లు ఏడాది ఆరంభం లోనే హిట్స్ కొట్టి ఈ ఏడాదికి మంచి ఆరంభాన్ని ఇచ్చాయి.


End of Article

You may also like