ఒక్క సినిమాతోనే మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్.? ఏకంగా కోటిరూపాయలు రెమ్యూనరేషన్.?

ఒక్క సినిమాతోనే మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్.? ఏకంగా కోటిరూపాయలు రెమ్యూనరేషన్.?

by Mohana Priya

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్‌లో మహేష్ బాబు చాలా స్టైలిష్‌గా, డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమా మొదటి పాట ఫిబ్రవరి 14న విడుదల అవ్వబోతోంది.

Video Advertisement

ఇదిలా ఉండగా మహేష్ బాబు రాబోయే సినిమా లాంచ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. లాంచ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్, పూజా హెగ్డే, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, నమ్రతా శిరోద్కర్ ఉన్నారు. సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో మొదలవుతుంది. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న మూడవ సినిమా ఇది.

this young heroine hiked remuneration for mahesh babu movie

అలాగే అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో సినిమాల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పూజా హెగ్డే నటిస్తున్న సినిమా ఇది. సాధారణంగా త్రివిక్రమ్ సినిమా అంటే ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఈ సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం త్రివిక్రమ్ వెతుకుతున్నారు. ఇందులో భాగంగా పెళ్లిసందడి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రీలీలని తీసుకోవాలని అనుకున్నారు త్రివిక్రమ్. కానీ శ్రీలీల మహేష్ బాబు సినిమా కోసం ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ అడిగారు అని సమాచారం. దీని వెనకాల కూడా ఒక కారణం ఉందట.

Heroines who made their telugu debuts in 2021

సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలు అంటే రెండవ హీరోయిన్లకి అంత పెద్ద ప్రాధాన్యత ఏమీ ఉండదు. కొన్ని సీన్లు, పాటల్లో తప్ప ఎక్కువగా కనిపించరు. అంతకుముందు అత్తారింటికి దారేదిలో ప్రణీత, అరవింద సమేత వీర రాఘవలో ఈషా రెబ్బ, అలాగే అల వైకుంఠపురంలో లో నివేతా పేతురాజ్ కూడా ఇలాగే కొద్దిసేపు మాత్రమే తెరపై ఉన్నారు. కాబట్టి త్రివిక్రమ్ నో చెప్పడానికి శ్రీలీల ఇలా చేశారు అని అంటున్నారు. మరి శ్రీలీల రెమ్యూనరేషన్ కి త్రివిక్రమ్ అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి.


End of Article

You may also like