సోషల్ మీడియా వినియోగం ఈరోజుల్లో మాములుగా లేదు. అయితే.. సద్వినియోగం చేసుకునే వారికంటే దుర్వినియోగం చేసుకునే వారే ఎక్కువ. మొన్నా మధ్య వరకు టిక్ టాక్ కు కూడా విశేషమైన ఆదరణ లభించింది. అయితే.. టిక్ టాక్ ను బాన్ చేయడం తో టిక్ టాక్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారు తమ ప్రయత్నాలను ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వంటి వాటిల్లో చేస్తున్నారు. అయితే ఓ మహిళా మాత్రం గుర్తింపు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఆమె టిక్ టాక్ స్టార్ సూర్య దేవి.

tiktak star surya devi

పలువురు సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులపైనా సోషల్ మీడియా లో పోస్ట్ లు వేస్తూ పాపులారిటీ కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమం లో సూర్య దేవి తనను చంపుతాను అని బెదిరిస్తోంది అంటూ సుబ్రమణ్యపురం మార్కెట్ ప్రాంతానికి చెందిన సిక్కా అనే ఓ వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేసారు. ఈ మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. మరో వైపు సిక్కా పై సూర్యదేవి దాడి చేస్తున్న వీడియో కూడా వైరల్ అయింది.

tiktak star surya devi

పోలీసులు ఆమెకోసం వెతకడం స్టార్ట్ చేసారు. అంతలోనే ఆమె తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఓ వీడియో ను రికార్డు చేసి పోలీసులకు పంపింది. పోలీసులు వెంటనే సమాచారం అందుకుని ఆమె ఇంటికి వెళ్లారు. ఇంటి తలుపులకు లోపల గడి వేసి ఉండడం తో కంగారు పడ్డారు. ఎన్నిసార్లు తలుపు కొట్టినా ఎవరు తీయకపోవడం తో మరింత కంగారు పడి తలుపులు పగలగొట్టారు. తీరా లోపలకి వెళ్లి చూస్తే ఆమె నిద్రపోతు కనిపించింది. కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా చేస్తోందని గుర్తించిన పోలీసులు ఆమె పై కేసు నమోదు చేసారు. మరో వైపు ఆమె తాను డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు చెబుతోంది.