2714 సంవత్సారానికి వెళ్ళిన టైమ్-ట్రావెలర్’ చెప్పిన భవిష్యత్తు పై విస్మయం కలిగించే విషయాలు?

2714 సంవత్సారానికి వెళ్ళిన టైమ్-ట్రావెలర్’ చెప్పిన భవిష్యత్తు పై విస్మయం కలిగించే విషయాలు?

by kavitha

Ads

కరోనా మహమ్మారి 2020 నుండి ఇప్పటికి కూడా అందరిని ఇబ్బందిపెడుతోంది. కరోనా బారిన పడి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మరణించారు. అయితే ఇది కొనసాగుతూనే ఉంది. ప్రజలు ఇప్పుడిప్పుడే కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితుల నుండి కోలుకుంటున్నారు.

Video Advertisement

ఇలాంటి సమయంలో తనని తాను టైమ్ ట్రావెలర్ గా చెప్తున్న వ్యక్తి చేసిన ఒక ప్రకటన అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఆ వ్యక్తి తాను భవిష్యత్తుకు వెళ్ళి వచ్చానని, రానున్న సంవత్సరాలలో భయంకరమైన అంటువ్యాధి రాబోతుందని తెలిపాడు. ఈ వ్యాధి వ్యాప్తి చెంది, కరోనా వలె ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరిని బాధితులగా  మారుస్తుందని చెప్పుకొచ్చాడు.
డైలీ స్టార్ ఇచ్చిన నివేదిక ప్రకారం, టైమ్ ట్రావెలర్ గా చెప్తున్న వ్యక్తి  కాలంతో ట్రావెల్ చేసి 2714 వ సంవత్సరం నుండి తిరిగొచ్చానని తెలిపాడు. అంతే కాకుండా ప్రమాదకరమైన మహమ్మారితో పాటుగా రాబోయే పదేళ్ళలో జరిగబోయే సంఘటనల గురించి కూడా హెచ్చరించాడు. అలాగే ప్రమాదకరమైన మహమ్మారి ఎక్కడ నుండి వస్తుంది. ఎలా వ్యాప్తి చెందుతుందో కూడా వెల్లడించాడు. అతని చెప్తున్న విషయాల ప్రకారంగా 2024లో మంచు కరిగి, దాని కింద ఉన్న హానికర వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరికి వ్యాపిస్తుంది.ముప్పై ఐదు కోట్ల మందికి పైగా ఈ వైరస్ బాధితులు అవుతారని తెలిపాడు. ఈ ప్రమాదకర వైరస్ అందరిని తీవ్రంగా భయనికి గురి చేస్తుందని తెలిపాడు. ఈ టైమ్ ట్రావెలర్ పేరు ఎనో అలరిక్.  @theradianttimetraveller అనే పేరుతో టిక్‌టాక్‌ ద్వారా తన వీడియోను షేర్ చేశాడు. ఈ ఏడాది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎలియన్స్ ని శోధిస్తుందని తెలిపాడు. ఇది ఎన్నో స్టార్స్ నుండి ఎక్కువ మొత్తంలో ఎనర్జీని గ్రహిస్తుందని, అనంతరం సూర్యుడి నుండి కూడా శక్తిని గ్రహిస్తుందని చెప్పాడు.ఇవే కాకుండా, ఆశ్చర్యపోయే విషయలు కూడా తెలిపాడు. మనషులు 2025లో అంగారక గ్రహానికి వెళ్తారని,  అక్కడ వాళ్ళు చూసే విషయాలు అందరిని ఆశ్చర్యపరుస్తాయని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రోనాట్స్ ల్యాండింగ్ అయిన దగ్గర మనుషుల ఎముకలను చూస్తారని చెప్పాడు. మనుషులు భూమి కన్నా ముందు అంగారక గ్రహం పై జీవించినట్లు సాక్ష్యం అని చెప్పి షాక్ కి గురి చేశాడు. ఇంకా అతిపెద్ద సౌర తుఫాన్ 2026లో భూమిని తాకుతుంది. దాంతో అంతర్జాతీయంగా 6 వారాల వరకు విద్యుత్తు అంతరాయం కలుగుతుందని చెప్పుకొచ్చాడు.Also Read: వీరు పాన్‌ కార్డ్ ను ఆధార్ నంబర్ తో లింక్ చేయనవసరం లేదు..


End of Article

You may also like