అవసరానికి ఫోన్ ని ఉపయోగించాలి తప్ప అనవసరంగా పిల్లలకి ఫోన్లు ఇవ్వకూడదు. అలానే పెద్దలు కూడా ఫోన్స్ తో అనవసరంగా సమయాన్ని వృధా చేసుకుంటూ వుంటారు. అది మంచిది కాదు. ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు ఇంటర్నెట్లో ఆటలకి అలవాటు పడిపోయారు. దీని వలన చదువు మీద శ్రద్ధ పెట్టారు కదా ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. పైగా అస్తమాను ఇంటర్నెట్ లో ఆటలు ఆడడం వలన ఏమవుతుంది అంటే శారీరకంగా వ్యాయామం జరగదు.

Video Advertisement

కంటి సమస్యలు మొదలు ఎన్నో సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలకి తల్లిదండ్రులు ఫోన్లు, లాప్టాప్లు ఇచ్చేస్తున్నారు అది అసలు మంచిది కాదు.

ఫోన్, లాప్టాప్, ట్యాబ్లెట్లను వారికి దూరంగా ఉంచాలి లేదంటే వ్యసనంలా మారుతుంది. వారిపై చెడు ప్రభావం చూపిస్తుంది. మీ పిల్లలు కూడా ఆన్లైన్లో ఎక్కువగా ఆటలాడుతూ ఉంటారా..? అయితే కచ్చితంగా ఇలా చేయండి. మీరు ఇలా చేయడం వలన ఇలాంటి ఆటలకి దూరంగా ఉంటారు.

#1. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ని వాళ్ళకి ఇవ్వకండి:

టాబ్లెట్స్, ఫోన్స్ ,లాప్టాప్స్ వంటి వాటిని వాళ్ళకి ఇవ్వకుండా చూసుకోండి. వారికి దూరంగా ఉంచి ప్రయత్నం చెయ్యండి.

#2. ఒంటరితనంగా ఉన్నామని అనిపించకూడదు:

మీ పిల్లలతో మీరు సమయాన్ని స్పెండ్ చేయడం వలన వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవ్వరు దానితో మీతో మాట్లాడటానికి మీతో విషయాలని పంచుకోవడానికి చూస్తూ ఉంటారు. ఒంటరిగా ఉండే పిల్లలు ఎక్కువగా గేమ్స్ కి అతుక్కుపోతారు కాబట్టి తల్లిదండ్రులు ఇలా ప్రయత్నం చేసి చూడండి మార్పు రావచ్చు.

#3. వారికి ఇష్టం అయిన వాటి మీద ధ్యాస మళ్లించండి:

మీ పిల్లలు కనుక ఆన్లైన్ గేమ్స్ కి వ్యసనం అయిపోయినట్లయితే వాళ్ల హాబీస్ కి తగ్గట్టుగా మీరు సలహా ఇవ్వండి. కొత్త విషయాలని నేర్పుతూ ఉండండి ఇలా వాళ్ళ దారి మళ్లించి మంచి విషయాలపై ఏకాగ్రత పెట్టేటట్టు చూడండి దానితో పిల్లలు గేమ్స్ కి దూరంగా ఉంటారు. అంతేకానీ తల్లిదండ్రులు ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారని పిల్లల్ని కొట్టడం తిట్టడం వంటివి చేయకూడదు ఇలా చేయడం వలన పిల్లలు మానసికంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు.