శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

by Anudeep

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది అనేది నిజం. టైంకి సరైన ఆహారం తీస్కుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు , ఉరుకుల పరుగులజీవితంలో మారుతున్న జీవన శైలి, ఆహారంలో మార్పులు, భోజనం తినే సమయంలో మార్పుల, నిద్ర లేమి ఇలా అనేక కారణాల ఫలితమే అనారోగ్యం.కానీ ఇప్పుడు ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. మనం ఎంత రోగ నిరోధక శక్తి పెంచుకుంటే మనలో కరోనాని ఎదుర్కొనే లక్షణాలు అంతగా మనమే ఏర్పరచుకున్నట్టు.కరోనా లక్షణాలైన జలుబు, దగ్గు లాంటి వాటికి దూరంగా ఉండాలంటే, అదే విధంగా మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఏ ఆహార పదార్ధాలు తీసుకోవాలో చూడండి, వాటిని మీ రోజు వారి ఆహారంలో భాగం చేసుకోండి.

Video Advertisement

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు >> అల్లం – వెల్లుల్లి

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

మన వంటింట్లో లభించే ఔషదాల్లో ప్రధానమైనవి అల్లం , వెల్లుల్లి. రోజూ కొంచెం పచ్చి అల్లం తినడం వలనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, గొంతు నొప్పి,జలుబు, దగ్గు లాంటివి ఉంటే తగ్గిపోతాయి . ఛాతిలో చేరిన కఫాన్ని కూడా తగ్గిస్తుంది.అల్లాన్ని విడిగా తీస్కోలేని వారు తేనెతో కలిపి తీస్కోవచ్చు. వెల్లుల్లిలో యాంటి ఫంగల్, యాంటి వైరల్, యాంటి బాక్టిరియల్ లక్షణాలు ఉంటాయి. రోజుకొక వెల్లుల్లి రెబ్బను తినడం ద్వారా దగ్గు ,జలుబు తగ్గడమే కాదు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు >> పసుపు

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

మనం సర్వసాధారణంగా వాడే వంటింటి మసాలాల్లో పసుపు ఒకటి. కొద్దిగా జలుబు, దగ్గు రాగానే పాలల్లో పసుపు వేసుకుని తాగడం, లేదంటే ఏదైనా గాయం కాాగానే పసుపు పెట్టడం మనం చాలా విరివిగా చేస్తుంటాం. పసుపు యాంటి బాక్టిరియల్ ఔషదం. ఇమ్యునిటిని కూడా పెంచుతుంది.

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు >> మిరియాలు

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

ఘాటుగా ఉండే నల్ల మిరియాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. జలుబు చేసినా, దగ్గు వచ్చి నా వెంటనే మిరియాల పాలు తాగు అనే మాట మనం తరచుగా వింటుంటాం. మసాలాల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీర ఇమ్యునిటిని పెంచడానికి దోహదం చేస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు >> సిట్రస్ ఫలాలు

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

నిమ్మ జాతికి చెందిన ఫలాలు మనల్ని జలుబు బారిన పడకుండా రక్షిస్తాయి. నిజానికి జలుబు చేయగానే, లేదంటే జలుబు చేస్తుందేమో అనే భయంతో పుల్లటి పదార్దాలను దూరం పెడతారు. కాని సి విటమిన్ లోపం వలనే జలుబు చేస్తుంది. సి విటమిన్ పుష్కలంగా అందించే నిమ్మ జాతి నిమ్,కమలా పండ్లను తినడం ద్వారా శరిరానికి కావలసిన విటమిన్ సి ని పొందవచ్చు. అంతే కాదు రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి ది ప్రధాన పాత్ర.

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు >> తేనె

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

రకరకాల అలెర్జీలనుండి ఉపశమనాన్ని పొందాలంటే తేనెని మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఆయుర్వేదం ప్రకారం తేనె ఎన్నో ఔషద గుణాల్ని కలిగి ఉంది. వ్యాధులను తగ్గించడమే కాదు, శరీరంలోని సూక్ష్మక్రిములను నాశనం చేసే శక్తి తేనెకి ఉంది.తేనెలో ఉండే హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు పుప్పొడి క్రిమినాశకాలుగా పనిచేస్తాయి. తేనె , అల్లం కలిపి రోజు తీస్కుంటే ఆరోగ్యానికి మంచిది.

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు >> బాదం పప్పు ఇతర మెలకలు

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

జలుబుని నివారించడానికి  విటమిన్ సి తోడ్పడుతుందని తెలుసుకున్నాం కదా. విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉండే డ్రై ఫ్రూట్ బాదం . విటమిన్ ఇ రోగనిరోదక వ్యవస్త మెరుగుపర్చే విటమిన్స్లో  చాలా కీలకమైనది. ఇది కొవ్వులో కరిగే విటమిన్, ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. మన శరీరానికి కావలసిన విటమిన్స్ 100శాతం అందిస్తుంది బాధం పప్పు. మొలకలు ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరమో అందరికి తెలిసిన విషయమే. బాదంతో పాటు మొలకల్ని కూడా రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు >> గుడ్లు, చికెన్

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

మనకి కొంచెం నలతగా ఉంటే చాలు నాన్ వెజ్ తింటే తగ్గిపోతుంది అనే నమ్మకం ఉంటుంది చాలామందిలో.  చికెన్ లో ఉండే బి-6 విటమిన్ శరీరంలో జరిగే అనేక రసాయన ప్రతి చర్యల్లో పాల్గొనే ముఖ్యమైన విటమిన్.అంతేకాదు ఆరోగ్యకరమైన  ఎర్ర రక్త కణాల ఏర్పాటు చేయడంలో కూడా తోడ్పడుతుంది. చికెన్లో జెలటిన్, కొండ్రోయిటిన్ రోగనిరోధక శక్తికి సహాయపడే ఇతర పోషకాలు ఉంటాయి.

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు >> బ్రకోలి మరియు పాలకూర

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

పాలకూరలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అంతేకాదుఇది అనేక యాంటీఆక్సిడెంట్లు మరియు బీటా కెరోటిన్లతో నిండి ఉండి, ఇది మన రోగనిరోధక వ్యవస్థని మెరుగుపరుస్తుంది.  బ్రకోలిని, పాలకూరను సాధ్యమైనంత తక్కువగా ఉడికించి తీసుకోవడం మంచిది. దీని వలన వాటిలోని పోషకాలను అంతేస్థాయిలో శరీరానికి అందించడానికి వీలవుతుంది. వీటి ద్వారా విటమిన్ ఎ, ఇతర యాంటి ఆక్సిడెంట్లు శరీరానికి లభ్యమవుతాయి.

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు >> గ్రీన్ టి

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఇవే

ఛాయ్ అభిమానులు కొద్ది రోజులు టీ,కాఫీలకు దూరంగా ఉండండి వాటి స్థానాల్లో బ్లాక్ టీ మరియు గ్రీన్ టి లకు చోటు కల్పించడం ఉత్తమం. ఎందుకంటే వీటిల్లో ఉండే యాంటి ఆక్సిడెంట్ ప్లేవనాయిడ్లు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

వీటితో పాటుగా ఇతర ఆహారపదార్దాలని సరైన టైంకి తీసుకుంటూ, టైం కి నిద్రపోతూ గాడి తప్పిన జీవన శైలిని ఒక క్రమపద్దతిలో మార్చుకోవడంతో పాటు, ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవడానికి ఇదే సరైన టైం. కాబట్టి ఇంకెందుకాలస్యం మొదలు పెట్టండి కరోనా పై యుద్దాన్ని..

You may also like