Ads
మన దగ్గర 50గజాల ప్లేస్ దొరికితే చాలూ.. ఐదంతస్తుల బిల్డింగ్ కట్టేస్తుంటారు..అది కూడా అన్ని రకాల సౌకర్యాలతో..ఆస్ట్రేలియాలో ఒక పెద్దమనిషి మన వాళ్లకి నాలుగు ఆకులు ఎక్కువ చదివినట్టున్నాడు.. ఆయన చేసిన నిర్వాకం చూస్తే ఎవడి పిచ్చి వాడికానందం అనుకుంటారు.ఇంతకీ ఆ పెద్దమనిషి ఏం చేశాడు అనుకుంటున్నారా??కిచెన్లోనే టాయిలెట్ కట్టించుకున్నాడు..అదేంటి అటాచ్డ్ బాత్రూం కామనే కదా అంటారా? అటాచ్డ్ బాత్రూం కామనే కానీ మధ్యలో గోడ కూడా కామన్..కానీ ఇక్కడ నో గోడల్..ఓన్లీ అద్దాల్..
Video Advertisement
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో సర్రిహిల్స్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు . సిడ్నీలో ఇల్లు అంటే మామూలు విషయం కాదు. ఉన్న స్థలంలోనే ఇల్లు కట్టుకోవాలి..కాని ప్లేస్ ఎక్కువ కనపడాలి.అందుకని ఇంటిని నిర్మించే బాధ్యత ఒక ఇటాలియన్ కి అప్పగించాడు. ఇల్లు రెడీ..ఇల్లు ఇరుకుగా కనపడకూడదని గోడల బదులు ఒక సన్నని అద్దాల్ని పెట్టించాడు.. బాత్రూంకి ఎక్కువ చోటెంందుకు అనుకున్నాడో ఏమో కిచెన్లో ఒక మూలన కొంచెం స్థలంలో కట్టిపడేశాడు..కిచెన్ కి బాత్రూం ఉన్న మూలకి మధ్యన అదే సన్నని అద్దం..
ఇల్లు రెడీ అయింది.. అందులో తనుంటాడా అంటే అదీ కాదు..అద్దెకివ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు..ఇల్లు ఖాళీ ఉందని తెలిసి చాలామంది రావడం ఇల్లు చూడడం , ఈ కిచెన్ – టాయిలెట్ చూసి వెనుదిరగడం ఇదీ వరుస..ఇంటిని చూడడానికి వచ్చిన వాళ్లల్లో అందరూ తిన్నగా ఉండరు కదా..వారిలో ఎవడో ఒక తుంటరి ఉన్నాడు. వెంటనే మొబైల్ తీసి క్లిక్ మనిపించి….ఈ కిచెన్-టాయిలెట్ ఇంటి ఫోటో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
సోషల్ మీడియాలో ఏదైనా కొత్తగా, వింతగా ఉంటే నెటిజన్లు వదులుతారా? అలాగే ఈ కిచెన్-టాయిలెట్ ఇంటిని వైరల్ చేసేశారు.. రకరకాల కామెంట్స్ వచ్చాయి.. ఆ ఇంటి ఓనర్ మాత్రం ఇల్లు చూడడానకిి వచ్చిన చాలామంది ఇల్లు బాగుంది అంటున్నారిని చెప్పుకుంటున్నాడు..పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అంటే ఇదేనేమో.ఒంటరిగా ఉండేవాళ్లు, లేదంటే ఒక జంట ఈ ఇంట్లో ఉండొచ్చు..వాళ్లు కాకుండా అతిధులు ఎవరొచ్చినా అంతే సంగతి..ఇంతటి విశేషవంతమైన ఇంటి అద్దె ఎంతో చెప్పలేదు కదా.. జస్ట్ 18వేలు మాత్రమే…
Sydney real-estate is a literal toilet in your literal kitchen going for $380 a week in Surry Hills. pic.twitter.com/xDTvxwA9JE
— Joan Westenberg (@Joanwestenberg) May 4, 2020
End of Article